Nitin Gadkari on Petrol Price: రూ.15కే లీటర్ పెట్రోల్, నితిన్ గడ్కరీ ప్రతిపాదించిన కొత్త ఐడియా ఇదిగో
దేశంలో రవాణా అవసరాలకు సగటు 60 శాతం ఇథనాల్ 40 శాతం విద్యుత్ వినియోగిస్తే పెట్రోలు లీటరు ధర రూ.15కు చేరుకుంటుందని, అంతిమంగా ఇది సామాన్యులకు లాభిస్తుందని చెప్పారు
Petrol to Be Sold at Rs 15 per Litre? దేశంలో పెట్రోలు ధరలు తగ్గించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ కొత్త ఐడియాను ప్రతిపాదించారు. దేశంలో రవాణా అవసరాలకు సగటు 60 శాతం ఇథనాల్ 40 శాతం విద్యుత్ వినియోగిస్తే పెట్రోలు లీటరు ధర రూ.15కు చేరుకుంటుందని, అంతిమంగా ఇది సామాన్యులకు లాభిస్తుందని చెప్పారు. రాజస్థాన్‌లో ప్రతాప్‌ఘడ్ నగరంలో మంగళవారం జరిగిన ఓ సభలో మంత్రి తమ ప్రభుత్వ విధానాల గురించి పలు కీలక వివరాలు వెల్లడించారు.
రైతులు కేవలం అన్నదాతలే కాదు, శక్తిదాతలు కూడా కాగలరని మా ప్రభుత్వం నమ్ముతోంది. త్వరలో దేశంలోని వాహనాలు 60 శాతం ఇథనాల్ కలిగిన ఇంధనతో పరుగులు పెడతాయి. మరో 40 శాతం రవాణా ఖర్చుకు విద్యుత్ కూడా జతచేస్తే దేశంలో పెట్రోల్ సగటున లీటరు రూ.15కే లభిస్తుందన్నారు.ఇథనాల్ ఆధారిత ఇంధనంతో కాలుష్యం తగ్గడమే కాకుండా ఇంధన దిగుమతులు కూడా తగ్గుతాయని చెప్పారు.
ANI Video
దిగుమతులపై ప్రస్తుతం ఖర్చు చేస్తున్న రూ.16 లక్షల కోట్లను రైతు శ్రేయస్సు కోసం వినియోగించవచ్చని చెప్పారు. నితిన్ గడ్కరీ ప్రతాప్‌ఘడ్‌లో రూ. 5600 కోట్లతో చేపట్టనున్న 11 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.