Modi Attends Pongal: పంచె కట్టి పొంగల్ వండిన ప్రధాని మోదీ, తమిళ సాంప్రదాయ పద్దతిలో పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని
తన సొంత బంధువులతో కలిసి పొంగల్‌ను జరుపుకుంటున్నట్లు తాను భావిస్తున్నట్లు అన్నారు.. అందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, సంతృప్తి ప్రవహించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు.
New Delhi, JAN 14: ప్రధాని మోదీ (PM Modi) సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ (L Murugan) నివాసంలో జరిగిన వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. సాంప్రదాయ పద్ధతిలో పంచెకట్టిన మోదీ.. కట్టెల పొయ్యిపై పాయసం వండారు. అనంతరం గోమాతకు సారె సమర్పించి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు.
‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ యొక్క భావోద్వేగాన్నిపొంగల్ పండుగ వర్ణిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. తన సొంత బంధువులతో కలిసి పొంగల్‌ను జరుపుకుంటున్నట్లు తాను భావిస్తున్నట్లు అన్నారు.. అందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, సంతృప్తి ప్రవహించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు.
ప్రధాని మోదీ మకర సంక్రాంతి, బిహు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దేశం నిన్న లోహ్రీ పండుగను జరుపుకుంది. కొంతమంది ఈ రోజు మకర సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ఇంకొందరు రేపు జరుపుకుంటారు, మాఘ బిహు కూడా వస్తోంది, ఈ పండుగల సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు మోదీ.
అనంతరం మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని మోదీ తిలకించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.