Vishwesha Teertha Swami Passes Away: పెజావర మఠాధిపతి విశ్వేశ్వరతీర్థ ఇక లేరు, విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ఓం శాంతి అంటూ ట్వీట్ చేసిన ప్రధాని, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కర్ణాటక సీఎం యడ్డ్యూరప్ప
ఉడిపి (Udupi)శ్రీకృష్ణ మఠ్‌లో. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న విశ్వేశ్వరతీర్థ డిసెంబర్ 20వ తేదీ నుంచి బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి పూర్తిగా విషమించి అపస్మారకస్థితిలోకి వెళ్లారు. దీంతో మఠంలోనే తుది శ్వాస విడవాలన్న ఆయన చివరి కోరిక ప్రకారం లైఫ్ సపోర్ట్‌తో స్వామిజీని ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంకు తరలించారు. మఠంలోనే ఆయన నేడు తుదిశ్వాస విడిచారు.
Udupi,December 29: పెజావర మఠం అధిపతి శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామిజీ(88) (Vishwesha Teertha Passes Away) కన్నుమూశారు. ఉడిపి (Udupi)శ్రీకృష్ణ మఠ్‌లో. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న విశ్వేశ్వరతీర్థ డిసెంబర్ 20వ తేదీ నుంచి బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి పూర్తిగా విషమించి అపస్మారకస్థితిలోకి వెళ్లారు. దీంతో మఠంలోనే తుది శ్వాస విడవాలన్న ఆయన చివరి కోరిక ప్రకారం లైఫ్ సపోర్ట్‌తో స్వామిజీని ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంకు తరలించారు. మఠంలోనే ఆయన నేడు తుదిశ్వాస విడిచారు.
పెజావర మఠం అధిపతి శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామిజీ(88)(Pejawar Mutt seer Swami Vishwesha Teertha) మృతిపట్ల ప్రధాని నరేంద్రమోడీ (PM Modi)విచారం వ్యక్తం చేశారు. శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామిజీ సమాజంలో ఆధ్యాత్మిక మార్గాన్ని పెంపొందింపజేసి..ప్రజలు భక్తి మార్గంలో పయనించేలా చేశారు.
Vishwesha Teertha Swami passed away
ఆయన ఎంతోమంది ప్రజల హృదయాల్లో, ఆలోచనల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఓం శాంతి అని మోదీ ట్వీట్ చేశారు. స్వామిజీతో సమావేశమైన సమయంలో తీసిన ఫొటోను ప్రధాని మోడీ ట్యాగ్ చేశారు.
Here's PM Modi Tweet
శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న విశ్వేశ్వర తీర్థ స్వామిజీ డిసెంబర్ 20వ తేదీ నుంచి బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్‌లో ఉన్న విశ్వేశతీర్థ కోలుకోవాలని ప్రార్థిస్తూ కర్ణాటక వ్యాప్తంగా భక్తులు పూజలు చేశారు. అయినా వారి పూజలు ఫలించలేదు. విశ్వేశతీర్థ చేసిన సేవలు అజరామరమైనవి, ఎప్పటికీ ఆయన మన మధ్యనే ఉంటారని ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్రహెగ్డే వ్యాఖ్యానించారు.
Here's ANI Tweet
తమ గురువు విశ్వేశతీర్థ ఆరోగ్యం క్షీణించడంతో కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి శనివారం నాడు ఆసుపత్రి వద్దనే గడిపారు. విశ్వేశతీర్థ ఆరోగ్యం విషమించడంతో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్డ్యూరప్ప(Karnataka Chief Minister BS Yediyurappa) శనివారం తమ కార్యక్రమాల్ని రద్దు చేసుకుని హుటాహుటీన ఉడుపి చేరుకున్నారు. ఆయన మరణం పట్ల సీఎం యడియూరప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
Here's ANI Tweet
స్వామిజీ భౌతికకాయాన్ని భక్తుల సందర్శనార్ధం ఉడుపి అజ్జార్‌కడ్ మైదానంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు ఉంచుతారు. అనంతరం మిలటరీ హెలికాప్టర్‌లో బెంగళూరుకు తరలించనున్నారు.
స్వామిని మఠానికి తరలించినప్పుడు..
ప్రముఖుల సందర్శనార్ధం అక్కడ నేషనల్ కాలేజీ మైదానంలో కొద్దిసేపు ఉంచుతామని ఉడుపి ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం విద్యాపీఠ్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.