Submarine Optical Fibre Cable: హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్, సముద్రం లోపల ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ, చెన్నై- అండమాన్ నికోబార్ దీవులకు అనుసంధానం
ఈ సందర్భంగా చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ వరకు మొట్టమొదటి సముద్రగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును (Submarine Optical Fibre Cable Connecting) ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) సోమవారం ప్రారంభించారు. ఇది భూభాగంలోని ఫైబర్ కేబుల్ కు సమానంగా హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది. చెన్నై- అండమాన్ నికోబార్ దీవులను (Chennai And Port Blair) అనుసంధానించే ఈ ప్రాజెక్ట్ కు మోడీ 2018, డిసెంబర్ 30న శంఖుస్థాపన చేశారు.
Delhi, August 10: అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ వరకు మొట్టమొదటి సముద్రగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును (Submarine Optical Fibre Cable Connecting) ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) సోమవారం ప్రారంభించారు. ఇది భూభాగంలోని ఫైబర్ కేబుల్ కు సమానంగా హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది. చెన్నై- అండమాన్ నికోబార్ దీవులను (Chennai And Port Blair) అనుసంధానించే ఈ ప్రాజెక్ట్ కు మోడీ 2018, డిసెంబర్ 30న శంఖుస్థాపన చేశారు.
చెన్నై- అండమాన్ నికోబార్ దీవుల మధ్య దూరం 2,312 కిలోమీటర్లు. ఈ దూరాన్ని ఏ మాత్రం లెక్కచేయకుండా.. కచ్చితమైన నెట్ సేవలు ఈ ప్రాజెక్ట్ ద్వారా అక్కడి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అండమాన్‌కు మెరుగైన సమాచారం అందించేలా ఫైబర్ కేబుల్ వ్యవస్థ పనిచేస్తుంది. చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్‌తో పాటు మరో ఏడు ద్వీపాలకు సబ్‌మెరైన్ కేబుళ్లు తీరంలో ఉన్న ద్వీపాలకు టెలీకమ్యూనికేషన్ సిగ్నల్స్ పంపించేలా చర్యలు చేపట్టారు. దేశంలో తాజాగా 62,064 కేసులు నమోదు, 22 లక్షలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, యాక్టివ్‌గా 6,34,945 కేసులు, మరణాల సంఖ్య 44,386
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ వరకు అక్కడి నుంచి నుండి లిటిల్ అండమాన్ మరియు పోర్ట్ బ్లెయిర్ నుండి స్వరాజ్ ద్వీప్ వరకు ఈ రోజు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో అక్కడ టూరిజం కూడా బాగా పెరుగుతుంది. ఓఎఫ్‌సీతో నికోబార్ ప్రజలకు మొబైల్ కనెక్టివిటి, వేగవంతమైన ఇంటర్నెట్ లభిస్తుంది. అండమాన్ ప్రజలకు డిజిటల్ ఇండియా లాభాలు అందుతాయి. అంగస్తంభన ఔషధంతో కరోనాకు చెక్, ఆర్ఎల్‌ఎఫ్-100 కోవిడ్ కు విరుగుడుగా పనిచేస్తుందని తెలిపిన హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్, సెప్టెంబర్ 1 నుంచి ప్రయోగాలు
టూరిజం, బ్యాంకింగ్, షాపింగ్, టెలిమెడిసిన్ లాంటి వసతులతో పాటు ఆన్‌లైన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. రూ. 1224 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తిచేసిన బీఎస్ఎన్ఎల్, టీసీఐఎల్ కంపెనీలకు ధన్యవాదాలు’ అని మోడీ అన్నారు. అనుకున్న సమయానికి 2300 కిలోమీటర్ల దూరం సముద్రం లోపల కేబుల్ వేయడం ప్రశంసనీయమని మోదీ తెలిపారు. డీప్ సీ సర్వేలు, కేబుల్ క్వాలిటీ, ప్రత్యేక షిప్‌లతో కేబుల్ వేయడం ప్రశంసనీయమన్నారు