PM Modi to Address Nation: రాత్రి 8 గంటలకు మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ, ఈ నెల 17తో ముగియనున్న మూడోదశ లాక్‌డౌన్

దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ (PMO India) చేసింది. మోదీ నిన్ననే అన్ని రాష్ట్రాల సీఎంలతో ఐదోసారి చర్చించారు. మెజారిటీ సీఎంలు లాక్‌డౌన్ కొనసాగించాలని కోరారు. దీంతో మరోసారి లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Vizag Gas Leak Tragedy PM Modi chairs emergency meet; 9 dead, thousands of peole hospitalised after styrene gas leak (Photo-ANI)

New Delhi, May 12: మరి కొద్ది రోజుల్లో మూడవ దశ లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి (PM Modi to Address Nation) ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ (PMO India) చేసింది. మోదీ నిన్ననే అన్ని రాష్ట్రాల సీఎంలతో ఐదోసారి చర్చించారు. మెజారిటీ సీఎంలు లాక్‌డౌన్ కొనసాగించాలని కోరారు. దీంతో మరోసారి లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగవ దశ లాక్‌డౌన్, ఈ నెల 15 లోగా రాష్ట్రాల సీఎంలు తమ అభిప్రాయాలు చెప్పాలన్న ప్రధాని మోదీ, వీడియో కాన్ఫరెన్స్‌లో ఎవరేమన్నారంటే..

దేశంలో ప్రస్తుతం మూడోదశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇది ఈ నెల 17తో ఇది ముగియనుంది. మార్చి నెల 24న ప్రారంభమైన లాక్‌డౌన్ తొలిదశ 21 రోజుల పాటు కొనసాగింది. ఏప్రిల్ 14న మరో 19 రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించారు. ఆ తర్వాత మరో రెండు వారాలు పొడిగించారు. నేడు మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగిస్తారని భావిస్తున్నారు. రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని చేసే ప్రసంగంలో వివిధ రంగాలకు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాగా కరోనా నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించడం ఇది ఐదోసారి. . రైళ్లను నడపవద్దన్న కేసీఆర్, ప్రజల్లో భయాన్ని తొలగించాలన్న వైయస్ జగన్, ప్రధాని మోదీతో ముగిసిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్

సోమవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15లోపు లాక్ డౌన్ పై అబిప్రాయాలు చెప్పాలని ప్రధాని రాష్ట్రాల సీఎంలను కోరారు. .కరోనా కట్టడి, ఆంక్షల సడలింపు, ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణపై ముఖ్యమంత్రులతో సమగ్రంగా చర్చించారు. కరోనా విజృంభణ తర్వాత సీఎంలతో సమావేశం కావడం ఇది ఐదోసారి.