PM Modi’s Address to Nation: మీ ప్రధానిగా ఓ కోరిక కోరుతున్నా, భారతీయుడు చెమటోడ్చి తయారుచేసిన చిన్న వస్తువును కొనుగోలు చేయండి, జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ

ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజు జాతినుద్దేశించి (PM Narendra Modi’s Address to Nation ) ప్రసంగించారు. భారత్‌ వంద కోట్ల డోసులు పూర్తి చేసింది. ఇది ప్రతీ భారతీయుడి విజయం అని.. దేశ సామర్థ్యానికి ప్రతీక అని ప్రశంసించారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి భారతీయుడికి కృతజ్ఞతలు తెలిపారు.

PM Narendra Modi. (Photo Credits: ANI)

New Delhi, October 22: కరోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో భార‌త్ 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ల‌ను వినియోగించిన దేశంగా నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజు జాతినుద్దేశించి (PM Narendra Modi’s Address to Nation ) ప్రసంగించారు. భారత్‌ వంద కోట్ల డోసులు పూర్తి చేసింది. ఇది ప్రతీ భారతీయుడి విజయం అని.. దేశ సామర్థ్యానికి ప్రతీక అని ప్రశంసించారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి భారతీయుడికి కృతజ్ఞతలు తెలిపారు.

కొవిడ్-19 టీకా కార్యక్రమంలో వీఐపీ క‌ల్చ‌ర్ ప్ర‌భావం ప‌డ‌కుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని ప్రధాని చెప్పారు. దేశంలో ‘అందరికీ టీకా’ నగదు రహిత వ్యాక్సిన్ అనే ప్రచారాన్ని ప్రారంభించాం.వాక్సిన్ పంపిణీలో పేద-ధనిక, గ్రామం-నగరం, సుదూర అనే తేడా లేకుండా దేశంలో ఒకే ఒక మంత్రం ఉంది. టీకాల పంపిణీలో ఎలాంటి వివక్ష ఉండదు’’అని మోదీ చెప్పారు.

130 కోట్ల మంది భారతీయులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తల కృషి తర్వాత ఈ మైలురాయిని (100 Crore COVID-19 Vaccinations) సాధించామని మోదీ చెప్పారు. వ్యాక్సినేష‌న్ సంపూర్ణంగా సైంటిఫిక్ ప‌ద్ధ‌తుల్లో వ్యాక్సినేష‌న్ (COVID-19 Vaccinations) కార్య‌క్ర‌మం జ‌రిగిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌ర్నీ స‌మంగా చూశామ‌ని, 100 కోట్ల టీకా మైలురాయిని సాధించినందుకు భారతీయులను మోదీ అభినందించారు. 100 కోట్ల డోసులు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు.. దేశ సామర్థ్యానికి ప్రతీక. మన దేశం ఎంత సంకల్ప బద్ధంగా ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుంది. భారత్‌ సాధించిన విజయాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి.

దేశంలో వంద కోట్ల మార్కును దాటిన కరోనా టీకాల పంపిణీ, తాజాగా 18,454 కొత్త కోవిడ్ కేసులు, 2021 జనవరి 16న భారత్‌లో ప్రారంభమైన వ్యాక్సినేషన్

గతంలో మనం విదేశాల నుంచి వ్యాక్సిన్‌ తెప్పించుకునేవాళ్లం. ఇప్పుడు విదేశాలకు టీకాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. శతాబ్ధి కాలంలో ఎన్నడూ చూడనటువంటి మహమ్మారి ప్రపంచం మీద దాడి చేసింది. ఈ మమమ్మారిని అడ్డుకునేందుకు భారత్‌ వ్యాక్సిన్‌లను ఎక్కడి నుంచి తీసుకువస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి. ప్రస్తుతం 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాయి’’ అన్నారు. కోవిడ్‌ మనకో సవాల్‌ విసిరింది.. భారత్‌ శక్తి ఏంటో చూపించాం. కరోనాపై పోరాటంలో ప్రజల భాగస్వామ్యాన్ని తొలి ఆయుధంగా మలుచుకున్నాం. భారత్‌ను ప్రపంచం ఇప్పుడు సురక్షిత దేశంగా చూస్తోంది. భారత్‌ వ్యాక్సిన్‌ హబ్‌గా మరింత మన్ననలు పొందుతోంది. 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పూర్తి చేయడం అనేది అద్భుత విజయం. మన టెక్నాలజీ, సామర్థ్యానికి ప్రతీక’’ అన్నారు.

‘‘కోవిన్‌ వల్ల టీకాలను సులభతరంగా, పారదర్శకంగా అందిస్తున్నాం. వ్యాక్సిన్‌ సరఫరాను సవాల్‌గా తీసుకున్నాం. అందరికి ఉచితంగా టీకా ఇచ్చాం. శాస్త్రీయ దృక్పథంతో వ్యాక్సిన్‌ పంపిణీ చేశాం. ప్రస్తుతం మేడిన్‌ ఇండియా వస్తువులకు ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ విశ్వాసం, ఉత్సామం కనిపిస్తోంది. అయితే రక్షణ కవచం ఉందని నిర్లక్ష్యం వద్దు. కరోనా ఇంకా కొనసాగుతోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుని పండుగలు జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకోవాలి’’ మోదీ అన్నారు

నేడు భారతీయ కంపెనీలలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం మాత్రమే కాదు, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కూడా సృష్టించామని, స్టార్టప్‌లలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయన్నారు. భారతదేశంలో తయారైన వస్తువులను కొనడం, స్థానికంగా భారతీయులు తయారు చేసిన వస్తువులను కొనడాన్ని ఆచరణలో పెట్టాలని సూచించారు.‘‘మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా భారతీయుడు చెమటోడ్చి తయారుచేసిన చిన్న వస్తువును కొనుగోలు చేయాలని నేను దేశ ప్రజలను కోరుతున్నాను. ఇది అందరి ప్రయత్నాలతో మాత్రమే సాధ్యమవుతుంది.’’ అని మోదీ వివరించారు.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి