Priyanka Gandhi: మీ కోసం పోరాడుతా..తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక గాంధీ..ప్రజల వ్యక్తిగా పనిచేస్తానని వెల్లడి
వయనాడ్ ప్రజలకు ప్రియాంక గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్‌లో ట్వీట్ చేసిన ప్రియాంక గాంధీ...తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజారిటీతో గెలిపించిన వయనాడ్ ప్రజల వ్యక్తిగా మీ ఆశలు, కలలను అర్థం చేసుకుంటాను అన్నారు. మీ కోసం పోరాడుతాను అని వెల్లడించారు.
Hyd, Nov 23: వయనాడ్ ప్రజలకు ప్రియాంక గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్‌లో ట్వీట్ చేసిన ప్రియాంక గాంధీ...తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజారిటీతో గెలిపించిన వయనాడ్ ప్రజల వ్యక్తిగా మీ ఆశలు, కలలను అర్థం చేసుకుంటాను అన్నారు. మీ కోసం పోరాడుతాను అని వెల్లడించారు.
మీరు నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు...ఈ విజయం మీ విజయని తెలిపారు ప్రియాంక. మీకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావిస్తున్నానని తెలిపారు. వయనాడ్ ప్రజల ఆశలు, కలలను నెరవేర్చే దిశగా తన ప్రయాణం ఉంటుందని తెలిపారు. పార్లమెంట్‌లో మీ గొంతు వినిపించేందుకు ఎదురుచూస్తున్నాను అని తెలిపారు. ఆరంభం అదుర్స్..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్‌లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
Here's Tweet:
నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే మీ అపారమైన ప్రేమకు కృతజ్ఞతలు అన్నాఉ. నా గెలుపు కోసం పని చేసిన యూడీఎఫ్ కుటుంబ సభ్యులకు, కార్మికులు, వాలంటీర్ల కృతజ్ఞతలు తెలిపారు. సోదరుడు రాహుల్ అందరికంటే ధైర్యవంతుడివి... నాకు దారి చూపినందుకు ఎల్లప్పుడూ నా వెన్నుదన్నుగా నిలిచినందుకు ధన్యవాదాలు చెప్పారు.