Rajasthan: ఆస్పత్రిలో గర్భిణి మృతి, వైద్యురాలిపై కేసు పెట్టిన కుటుంబసభ్యులు, అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలు, రాజస్థాన్‌లో విసాద ఘటన
ఓ ప్రైవేట్ ఫెసిలిటీలో గర్భిణి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు డాక్టర్ మీద కేసు పెట్టారు. ఈ అవమానం తట్టుకోలేక మహిళా వైద్యురాలు ఆత్మహత్య (Dies by Suicide) చేసుకుంది.
Jaipur, Mar 30: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఫెసిలిటీలో గర్భిణి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు డాక్టర్ మీద కేసు పెట్టారు. ఈ అవమానం తట్టుకోలేక మహిళా వైద్యురాలు ఆత్మహత్య (Dies by Suicide) చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో (Private Hospitals in Dausa) ప్రైవేట్ ఆస్పుత్రిని డాక్టర్ అర్చన శర్మ, ఆమె భర్త కలిసి నిర్వహిస్తున్నారు. ఆ ఆస్పత్రిలో గర్భిణి చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్యంగా కారణంగానే ఆమె చనిపోయిందంటూ గొడవకు దిగారు.
దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు సదరు డాక్టర్ అర్చనపై కేసు (Doctor Booked for Death of Pregnant Woman) నమోదు చేశారు. అంతేగాదు ఆమె పై తక్షణమై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో లాల్సోట్ పోలీస్ స్టేషన్‌లో ఆ డాక్టర్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన వైద్యురాలు అవమానం తట్టుకోలేక తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాస్తూ ప్రసూతి వైద్యురాలి ఆత్మహత్య కేసులో తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించుకోవాలని మరియు కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. డాక్టర్ అర్చన శర్మ ఆత్మహత్య ఘటన రాష్ట్రానికి, దేశానికి తీరని లోటు అని సంఘం లేఖలో పేర్కొంది.
గర్భిణీ స్త్రీలలో ప్రసవం తర్వాత ప్రసవానంతర రక్తస్రావం అనేది తెలిసిన సమస్య అని అసోసియేషన్ పేర్కొంది. రోగి అటెండర్ల ద్వారా వైద్యులను వేధింపులకు గురిచేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి, అలాగే భవిష్యత్తులో ఇటువంటి విషాద సంఘటన పునరావృతం కాకుండా కోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని మేము కోరుతున్నాము" అని లేఖలో పేర్కొన్నారు. సెక్షన్ 302 కింద వైద్యులపై కేసు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పునిచ్చినందున పోలీసులు ఆ వైద్యురాలిపై కేసు నమోదు చేయకూడదని రాజస్థాన్ ఆరోగ్య మంత్రి పార్సాది లాల్ మీనా అన్నారు.