Narendra Mehta: బీజేపీ మాజీ నేతపై అత్యాచారం కేసు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సుఖం పొందాడని బీజేపీ మహిళా కార్పోరేటర్ ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు

నరేంద్ర మెహతా (Narendra Mehta) తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని ఓ మహిళా మున్సిపల్ కార్పొరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది.

Narendra Mehta (Photo Credits: IANS)

Mumbai, Feb 29: మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాపై అత్యాచారం, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. నరేంద్ర మెహతా (Narendra Mehta) తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని ఓ మహిళా మున్సిపల్ కార్పొరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది.

ముంబై నగరానికి చెందిన పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట ఇచ్చి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని థానే జిల్లా బయందర్ మహిళా కార్పొరేటర్ (BJP woman municipal corporator) ఆరోపణలు చేశారు. నరేంద్ర మెహతా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి గీతాజైన్ చేతిలో ఓటమి పాలయ్యారు.

మహిళా కార్పొరేటర్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాలు (BJP Former MLA Narendra Mehta) కలిసి అభ్యంతరకరమైన పరిస్థితిలో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. పోలీసులు నరేంద్ర మెహతాపై ఐపీసీ సెక్షన్ 376(2), 496, 417, 323, 504,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బాధితురాలి ఫిర్యాదుతో నరేంద్ర మెహతాతో పాటు ఆయన సన్నిహితుడు సంజయ్ పైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రేప్, అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. నరేంద్ర మెహతా పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

1999 నుంచి తనను, తన కుటుంబసభ్యులను నరేంద్ర మెహతా వేధిస్తున్నారని బాధితురాలు వాపోయింది. దీనిపై శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ తీవ్రంగా స్పందించారు. వెంటనే నరేంద్ర మెహతాను అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. మహిళల సంక్షేమం, రక్షణ గురించి గళమెత్తే బీజేపీ లాంటి పార్టీలో ఇలాంటి కీచకుడు ఉండటం విచారకరం అన్నారు. ఇదిలా ఉంటే నరేంద్ర మెహతా మూడు రోజుల క్రితమే బీజేపీకి రాజీనామా చేశారు.



సంబంధిత వార్తలు

PM Modi to Visit Kuwait: 43 ఏళ్ల తర్వాత భారత్ నుంచి కువైట్ పర్యటనకు ప్రధాని, రెండు రోజుల పాటు ప్రధానమంత్రి మోదీ పర్యటన, చివరిసారిగా 1981లో పర్యటించిన ఇందిరాగాంధీ

Congress MLA Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, కేటీఆర్ అరెస్ట్ తర్వాత విధ్వంసానికి బీఆర్ఎస్ కుట్ర...రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్లాన్ చేశారని కామెంట్

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif