Kerala: మయోనైజ్‌వినియోగంపై నిషేదం, ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరిగిపోతుండటంతో నిర్ణయం, ఇకపై బేకరీలు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల్లో నాన్ వెజ్ మయోనైజ్ వాడొద్దంటూ కేరళ ప్రభుత్వం ఆదేశాలు
ఇటీవల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా పచ్చి గుడ్డు వాడి తయారు చేసిన మయోనైజ్‌ను వాడొద్దని నిర్ణయించారు. ఈ మేరకు నాన్ వెజ్ మయోనైజ్ ను (Raw egg mayonnaise) నిషేదిస్తున్న బేకర్స్ అసోసియేషన్ కేరళ నిర్ణయాన్ని ప్రకటించింది.
Kochi, JAN 12: కేరళలో మయోనైజ్ పై (mayonnaise) నిషేదం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా పచ్చి గుడ్డు వాడి తయారు చేసిన మయోనైజ్‌ను వాడొద్దని నిర్ణయించారు. ఈ మేరకు నాన్ వెజ్ మయోనైజ్ ను (Raw egg mayonnaise) నిషేదిస్తున్న బేకర్స్ అసోసియేషన్ కేరళ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో కేరళవ్యాప్తంగా అన్ని రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ కోర్టుల్లో నాన్ వెజ్ మయోనైజ్ వాడకాన్ని నిషేదించనున్నారు. దాని స్థానంలో వెజ్ మయోనైజ్ ను కానీ, పాశ్చరైజ్డ్ ఎగ్స్ తో చేసిన మయోనైజ్ ను కానీ వాడనున్నారు. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ (Veena George) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బేకరీ అసోసియేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు వినియోగదారులు ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన మరిన్న జాగ్రత్తలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ఫుడ్ కోర్టులు, బేకరీలు, రెస్టారెంట్లు లైసెన్స్ తీసుకోవాలని, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ టోల్ ఫ్రీ నెంబర్ ను అందరికీ కనిపించేలా డిస్ ప్లే చేయాలని సూచించింది ప్రభుత్వం. ఉద్యోగులు కూడా ఫిట్ నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఇది అన్ని కంపెనీలకు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.