Jio V3 and V4 4G Feature Phones: జియో నుంచి మరో రెండు కొత్త ఫీచర్ ఫోన్లు, జియో భారత్‌ వీ3, వీ4 మొబైల్స్‌ ధర ఎంతంటే..

అమెజాన్‌, జియో మార్ట్‌తో పాలు ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో కొనుగోలు చేయొచ్చని పేర్కొంది. ఈ ఫీచర్‌ ఫోన్‌ కొన్న వాళ్లకి జియో రూ.123 రీఛార్జి ప్లాన్‌ ఉచితంగా ఇస్తోంది.

JioBharat V3 and V4 (Photo-Jio)

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఇండియన్‌ మొబైల్ కాంగ్రెస్‌ 2024 (IMC) ఈవెంట్‌లో రిలయన్స్‌ జియో రెండు ఫీచర్‌ ఫోన్లను లాంచ్‌ చేసింది. గతేడాదిలో వీ2 పేరిట తీసుకొచ్చిన ఫోన్‌కు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో ఇదే సిరీస్‌లో మరో రెండు మొబైల్స్‌ జియో భారత్‌ వీ3, వీ4 తీసుకొచ్చింది. 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేసేలా ఈ మొబైల్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు జియో తెలిపింది.

RBI Monetary Policy Meeting 2024: వ‌రుస‌గా ప‌దోసారి కూడా రెపో రేటు 6.5 శాతంగానే ఫిక్స్, వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ 

ఈ రెండు మొబైల్స్‌ ధర రూ.1,099 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. అమెజాన్‌, జియో మార్ట్‌తో పాలు ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో కొనుగోలు చేయొచ్చని పేర్కొంది. ఈ ఫీచర్‌ ఫోన్‌ కొన్న వాళ్లకి జియో రూ.123 రీఛార్జి ప్లాన్‌ ఉచితంగా ఇస్తోంది. అంతే ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో నెలపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌, 14జీబీ డేటా అదనంగా పొందొచ్చు. రెండు మొబైల్స్‌ 1,000mAh బ్యాటరీతో వస్తున్నాయి. 128జీబీ స్టోరేజీ సామర్థ్యం కలిగి ఉంటాయి. 23 భాషలకు సపోర్ట్‌ చేసేలా వీటిని తీసుకొచ్చారు. జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి ప్రీ- ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. జియో తక్కువ ధరలో అందించే జియో భారత్‌ ప్రత్యేక ప్రీపెయిడ్‌ ప్లాన్లతో దీన్ని రీఛార్జి చేసుకోవచ్చు.