Rajasthan Minister Viral Video: రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి, రాజస్థాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

తన నియోజకవర్గంలోని రహదారులను కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Rajasthan November 24: మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండో రోజే వివాదంలో చిక్కుకున్నారు రాజస్థాన్ కేబినెట్ మినిస్టర్ రాజేందర్ సింగ్ గుడా. తన నియోజకవర్గంలోని రహదారులను కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న రాజేంద్ర సింగ్ గుడా తన నియోజకవర్గంలోని ఉడైపురవాటి ప్రాంతం ప్రజలతో సమావేశమయ్యారు. ఆయనతో తమ సమస్యల్ని విన్నవించుకున్నారు ప్రజలు. ఈ సందర్భంగా తమ ప్రాంతంలో రహదారులను బాగుచేయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అక్కడే ఉన్న పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌ మెంట్‌ చీఫ్‌ ఇంజినీర్‌తో నా నియోజకవర్గంలో రహదారులు కత్రినా కైఫ్‌ బుగ్గల్లా ఉండాలి అని మంత్రి అన్నారు. దీంతో అక్కడి ప్రజలు కొందరు చప్పట్లు కొట్టగా, మరికొందరు నవ్వులు చిందించారు.

గతంలో కూడా పలువురు నేతలు రోడ్లను సినీతారల బుగ్టలతో పోల్చిన సందర్భాలున్నాయి. 2005లో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ కూడా రహదారుల్ని హేమమాలిని బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ హామీ ఇవ్వడం అప్పట్లో వివాదానికి దారితీసింది. ఇక మధ్యప్రదేశ్‌ న్యాయశాఖ మంత్రి పీసీ శర్మ కూడా 2019లో తమ రాష్ట్రంలో గుంతలమయమైన రోడ్లను సుందరంగా, డ్రీమ్‌గర్ల్‌ స్టార్‌ బుగ్గల్లా మారుస్తామంటూ చెప్పారు. అటు 2013లో యూపీలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారాం పాండే ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో రహదారులను సినీతారలు హేమమాలిని, మాధురీ దీక్షిత్‌ బుగ్గల్లా నిర్మిస్తామంటూ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అప్పటి సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif