Gold Price: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్, బంగారం ధరలకు రెక్కలు, ఏకంగా గ్రాముకు రూ. 850 పెరిగిన బంగారం
బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకి రూ. 850 పెరిగింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకి రూ. 930 లు హైక్ అయ్యంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలవటంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో యూరోప్, అమెరికా దేశాల జోక్యం తప్పకుండా ఉంటుంది. ఈ ఎఫెక్ట్ మొత్తం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ఇలాంటి సమయంలో చాలా మంది ఇన్వెస్టర్లు సేఫ్ పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. స్టాక్ మార్కెట్లలో స్టాక్స్ పై నుంచి పెట్టుబడులు తీసి బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో బంగారం ధరలకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చింది.
బంగారం ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకి రూ. 850 పెరిగింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకి రూ. 930 లు హైక్ అయ్యంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. గ్రాముకు ఏకంగా 30 శాతం బంగారం ధరలు పెరగటం విశేషం.