Anil Ambani: అనిల్‌ అంబానీకి ఎదురు దెబ్బ, మూడు నెలలపాటు స్టాక్ మార్కెట్ నుంచి నిషేధం విధించిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.

రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, దాని ప్రమోటర్ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకం చేయకుండా నిషేధించింది.

Anil Ambani (Photo-PTI)

ముంబై, ఫిబ్రవరి 13: అనిల్‌ అంబానీపై మూడు నెలలపాటు నిషేధం విధించింది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, దాని ప్రమోటర్ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకం చేయకుండా నిషేధించింది. అనిల్‌తో పాటుగా మరో ముగ్గురినీ కూడా బ్యాన్ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నేరుగా లేదా పరోక్షంగా సెక్యూరిటీలలో డీల్ చేయలేర‌ని సెబీ పేర్కొంది. కంపెనీ నుంచి నిధులను మళ్లించారనే ఆరోపణలతో అనిల్‌ అంబానీతో పాటుగా…అమిత్‌ బప్నా, రవీంద్ర సుధాకర్‌, పింకేశ్‌ ఆర్‌షాపై కూడా సెబీ నిషేధం విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ 2018-19లో తీసుకున్న రుణాల విధానాన్ని సెబీ పరిశీలించింది.

ఖబర్ధార్‌ మోదీ.. ఇది తెలంగాణ అడ్డా, నిన్ను తరిమికొట్టేందుకు తెలంగాణ పులిబిడ్డ‌ వస్తున్నాడు, ఏం చేస్కుంటావో చేసుకో. మీ సంస్కరణలను మేం అమలు చేయమని తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్

కనీసం 13 సంస్థలకు నిధులను బదిలీ చేసినట్టు తేల్చింది. 2019లో GPCL వంటి అనేక సంస్థలకు కంపెనీ ద్వారా 14 వేల 578 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్టు గుర్తించింది. ఇందులో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ నిర్వహణకు సంబంధించిన 47 కంపెనీలకు 12 వేల 489 కోట్లు బదిలీ అయినట్టు ఫోరెన్సిక్ ఆడిట్ గుర్తించింది. మరోవైపు నిధుల మళ్లింపు కేసులో ఎస్‌ఎస్‌ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ, సీఈవో రవినారాయణ్‌పై జరినామా విధించింది. రామకృష్ణకు 3కోట్లు, నారాయణ్‌కు 2 కోట్లు ఫైన్ వేసింది సెబీ. అలాగే 28 మందికి నోటీసులు జారీ చేసింది. వీరందరిపై విచారణ కొనసాగుతుందని తెలిపింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif