FIR Filed Against Nithyananda: నిత్యానందపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు, చిన్నారులను కిడ్నాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్, నేపాల్‌లో తల‌దాచుకున్న నిత్యానంద

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని తమ ఆశ్రమంలో​ నలుగురు చిన్నారులను విరాళాల సేకరణకు ఉపయోగించుకుంటూ ఆశ్రమంలో దిగ్బంధించారనే ఆరోపణలపై నిత్యానంద(Self-Styled Godman Nithyananda)పై కేసు నమోదు చేశారు.

Self-Styled Godman Nithyananda Charged For Allegedly Kidnapping Children (Photo-File Image)

Ahmedabad,November 22: స్వామి నిత్యానందపై గుజరాత్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు (FIR filed Against Nithyananda) చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని తమ ఆశ్రమంలో​ నలుగురు చిన్నారులను విరాళాల సేకరణకు ఉపయోగించుకుంటూ ఆశ్రమంలో దిగ్బంధించారనే ఆరోపణలపై నిత్యానంద(Self-Styled Godman Nithyananda)పై కేసు నమోదు చేశారు. మరోవైపు నిత్యానంద శిష్యులు సాధ్వి ప్రణ్‌ప్రియానంద (Sadhvi Pranpriyananda), సాధ్వి ప్రియతత్వ రిధి కిరణ్‌( Priyatatva Riddhi Kiran)లను చిన్నారులను కిడ్నాప్‌ చేసి, బాల కార్మికులుగా వారితో పనిచేయిస్తున్నారనే ఆరోపణలపై (kidnapping and wrongful confinement of children) అరెస్ట్‌ చేశారు. నలుగురు చిన్నారులను ఆశ్రమంలోని ఫ్లాట్‌ నుంచి రక్షించిన పోలీసులు వారి స్టేట్‌మెంట్‌ ఆధారంగా నిత్యానందపై కేసు నమోదు చేశారు.

ఈ ఆశ్రమాన్ని నిత్యానంద తరపున సాధ్వి ప్రణ్‌ప్రియానంద, సాధ్వి ప్రియతత్వ రిధి కిరణ్‌లు నిర్వహిస్తున్నారని, చిన్నారులను అక్రమంగా నిర్బంధించి వారిచే ఆశ్రమాన్ని నడిపేందుకు విరాళాలను వసూలు చేయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. చిన్నారుల తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులకు ఆశ్రమంలో సాగుతున్న వ్యవహారం రట్టయింది.

మరోవైపు తమ ఇద్దరు కూతుళ్లను నిత్యానంద స్వామి అహ్మదాబాద్‌లోని తన సర్వజన ఆశ్రమంలో బంధించాడని బెంగళూరుకు చెందిన జనార్ధనస్వామి దంపతులు ఆరోపిస్తున్నారు. నిత్యానంద ఆశ్రమం నుంచి తమ కుమార్తెలను తమకు అప్పగించేందుకు ఆశ్రమ నిర్వాహకులను ఆదేశించాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. జనార్ధన శర్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అహ్మదాబాద్ పోలీసులు నిత్యానంద స్వామి ఆశ్రమంలో తనిఖీలు జరిపారు.

అమ్మాయిల స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. కేసులో నిత్యానంద స్వామిని విచారించేందుకు పోలీసులు వెతుకుతున్నారు. కేసు దర్యాప్తు సాగుతుండగానే నిత్యానంద స్వామి ఓ వీడియో విడుదల చేశారు. ఆరోపణలు చుట్టుముట్టిన వేళ అహ్మదాబాద్ భక్తులు తనకు అండగా నిలిచిన తీరు అద్భుతమని కొనియాడారు. ఆశ్రమంలో ఎవరినీ నిర్బంధించ లేదని, పిల్లలను కలవకుండా తల్లిదండ్రులెవరినీ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ఎవరినైనా కలవాలా వద్దా అన్నది వారి ఇష్ట ప్రకారమే ఉంటుందన్నారు.

7 నుంచి పదిహేనేళ్ల మధ్య వయసున్న తన నలుగురు పిల్లలను నిత్యానంద స్వామి ఆధ్వర్యంలో నడిచే ఓ సంస్థలో 2013లో చేర్పించామని జనార్ధన శర్మ తన పిటిషన్‌లో తెలిపారు. అయితే నిత్యానంద తమను సంప్రదించకుండా పిల్లలు నలుగురినీ అహ్మదాబాద్‌లోని తన ఆశ్రమంలోని మరో సంస్థకు తరలించారని ఆరోపించారు. తమకు ఈ విషయం తెలియగానే, నలుగురు పిల్లలను మళ్లీ అహ్మదాబాద్‌లోని సర్వజనపీఠానికి రహస్యంగా తరలించారని తెలిపారు. పిల్లలను కలుసుకునేందుకు ఆ ఆశ్రమానికి తాము వెళితే లోపలకు అనుమతించ లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

దీంతో స్థానిక పోలీసులు, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సాయతో తన ఇద్దరు మైనర్ బాలికలను వెనక్కి తీసుకొచ్చామన్నారు. అయితే తమ పెద్ద కుమార్తె లోపముద్ర(21), రెండో కుమార్తె నందిత(18) తమతో వచ్చేందుకు నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమ నిర్వాహకుల బెదిరింపులకు భయపడి వారు తమతో రాలేదన్నారు. కోర్టు జోక్యం చేసుకుని తమ కుమార్తెలిద్దరినీ తమకు అప్పగించాలని కోరారు. శర్మ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అహ్మదాబాద్ రూరల్ పోలీసులు నిత్యానందతో పాటు ఆశ్రమంలోని ఇతర అధికారులపై కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే నకిలీ పాస్‌పోర్ట్‌పై నిత్యానంద నేపాల్‌లో తలదాచుకున్నాడు.