Union Finance Minister Nirmala Sitharaman. (Photo Credit: PTI)

New Delhi, January 31:  ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) 2020-21 కేంద్ర బడ్జెట్‌ను (Union Budget 2020-21) ప్రవేశపెట్టబోతుండటంతో, దేశం మొత్తం వారి 'లెక్కల పద్దు' పై ఎన్నో ఆకాంక్షలతో ఎదురుచూస్తోంది.  ఈ నేపథ్యంలో, దేశంలో సుమారు 60 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులు గల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ షేర్‌చాట్ ( ShareChat), దేశంలోని వివిధ వర్గాల ప్రజలు ఎలాంటి అంచనాలతో ఉన్నారు, ఈ బడ్జెట్ ద్వారా వారేం ఆశిస్తున్నారో  తెలుసుకునేందుకు దేశవ్యాప్త సర్వేను చేపట్టింది. ఆ సర్వే ప్రకారం ఎక్కువ మంది మూడు అంశాలపై తమ ఆకాంక్షలను వెలిబుచ్చారు. అవి ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మినహాయింపులు, ఉపాధి అవకాశాల పెంపు మరియు నిత్యావసర ధరలు తగ్గించడం ప్రధానంగా ఉన్నాయి.

ఆరు భాషల్లో షేర్‌చాట్ చేపట్టిన సర్వే యొక్క డేటాను క్రోడికరించి విశ్లేషిస్తే, చాలా మంది భారతీయులు ప్రప్రథమంగా ఆదాయపు పన్ను స్లాబ్‌ను సంస్కరించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరుతున్నారు. రెండవది నిరుద్యోగం. పేద, మధ్య తరగతి ప్రజలు ఈ బడ్జెట్ పట్ల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆర్థిక మందగమనం కారణంగా దేశంలో చాలా మంది నిరుద్యోగులయ్యారు. ఈ కారణంగా కేంద్ర బడ్జెట్ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేలా ఉండాలని వారు కోరుకుంటున్నారు.  ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నా, భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠమైనది.- రాష్ట్రపతి

ఇక మరో ప్రధాన ఆకాంక్ష, నిత్యావసర ధరల్లో తగ్గుదల. ఇటీవల మార్కెట్లో కూరగాయల ధరలు, ముఖ్యంగా ఉల్లి ధరలు ఆకాశన్నంటాయి. సామాన్య ప్రజల సంపాదన మొత్తం తిండికే సరిపోవట్లేదు. ఈ కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించేలా చొరవ తీసుకోవాలని అని కోరుకున్నారు.

షేర్‌చాట్ క్రోడీకరించిన ప్రజాభిప్రాయ సేకరణ డేటా మరియు ప్రజల ఆకాంక్షలు

    భాష మొత్తం వీక్షకుల సంఖ్య (మిలియన్లలో) యూజర్ల ఎంగేజ్మెంట్ వాట్సాప్   షేర్స్ యూజర్ల ఆకాంక్షలు
హిందీ      6 1,00,000 20,000 ఎ) జీఎస్టీని తగ్గించాలి

బి) మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలి

సి) తక్కువ ఆదాయ పన్ను రేట్లు

 తమిళం    2 80,000 22,000 ఎ) నిత్యావసర ధరల పెరుగుదల నియంత్రణ.

బి) ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి.

సి) దేశంలో ఆర్థిక మందగమనానికి పరిష్కారం చూపాలి.

పంజాబీ   2 40,000 12,000 ఎ) జీఎస్టీని తగ్గించాలి

బి) రైతాంగానికి చేయూత; రైతులకు రుణ మాఫీ

  మరాఠీ   1 23,000 4,000 ఎ) సామాన్యులకు మరియు రైతులకు తోడ్పాటుగా బడ్జెట్ ఉండాలి

బి) ఆరోగ్యం, విద్య మరియు వ్యవసాయంపై బడ్జెట్ ఎక్కువ దృష్టి పెట్టాలి

సి) 5 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉండాలి

d) చిరు వ్యాపారులకు తోడ్పాటును మరియు ఉపాధిని పెంచండి

ఇ) బాలికల విద్య మరియు భద్రత

  బెంగాలీ  0.8 15,000 2,300 ఎ) నిత్యావసర ధరల తగ్గుదల

బి) ఆదాయపు పన్ను స్లాబ్లను విస్తరించాలి

  కన్నడ   1 22,000 1,800 ఎ) ఆదాయపు పన్ను, బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించాలి

బి) మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలి

 

వీటితో పాటు మరెన్నో అంశాలపై దేశ ప్రజలు ఆశలు పెట్టుకొని, తమ అభిప్రాయాలను వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ నుండి ప్రజలు ఆశిస్తున్న ఇతర వాటిల్లో జీఎస్టి తగ్గింపు, వ్యవసాయాన్ని, రైతాంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు మరియు మహిళల భద్రతను పెంచడం తదితరమైనవి ఉన్నాయి. 2020 జనవరి 28 (ఉదయం 10) నుండి జనవరి 30, 2020 (ఉదయం 10) వరకు చేపట్టిన సర్వే ద్వారా ఈ డేటాను సేకరించినట్లు షేర్‌చాట్ తెలిపింది. గత రెండు రోజులలో 80,000 కి పైగా వాట్సాప్ లో షేర్ చేయబడిన సందేశాల డేటాను విశ్లేషించినట్లు వెల్లడించింది.



సంబంధిత వార్తలు

PAN-Aadhaar Linking: ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయని వారికి బిగ్ అలర్ట్,రెండింతల టీడీఎస్‌ కోతలుంటాయని తెలిపిన ఐటీ శాఖ

No Change in Income Tax Slabs: కొత్త ఆదాయపు పన్ను విధానంపై కేంద్రం క్లారిటీ, నేటి నుంచి ఎస్బీఐ డెబిట్ కార్డు చార్జీల మోత, ఏప్రిల్ 1 నుంచి జరిగే మార్పులు ఇవే..

Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చు పెట్టేంత డబ్బు నా దగ్గర లేదు, అందుకే పోటీ చేయడం లేదు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు, ఏపీ గురించి ఏమన్నారంటే..

PM Modi on Interim Budget 2024: ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపిన ప్రధాని మోదీ, యువత ఆకాంక్షలను మధ్యంతర బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్న భారత ప్రధాని

No Changes in Income Tax Rates: వేతన జీవులకు మోదీ సర్కారు ఊరట, ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలకు పెంపు, ఆదాయ పన్ను శ్లాబులలో ఎలాంటి మార్పు లేదని వెల్లడి

Lok Sabha Passes Finance Bill 2024: ఆర్థిక బిల్లు 2024కు లోక్‌సభ ఆమోదం, కేంద్ర బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా, కేంద్ర మధ్యంతర బడ్జెట్ పూర్తి అప్ డేట్స్ ఇవిగో..

Union Budget 2024: నారీ శక్తి ద్వారా మన దేశ మహిళా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పాం, కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు

What Is Interim Budget: మోదీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌బోయే మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్ ప్ర‌త్యేక‌త‌లు ఇవే! అస‌లు మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్ అంటే ఏంటి? సాధార‌ణ బ‌డ్జెట్ తో పోలిస్తే తేడా ఏంటి?