Singer Sidhu Moose Wala Shot Dead: పంజాబ్‌లో కాంగ్రెస్ నేతపై కాల్పులు, భద్రత ఉపసంహరించుకున్న మరుసటిరోజే ఘటన, 20 రౌండ్లకు పైగా కాల్పులు జరిపిన దుండగులు, స్పాట్‌లోనే కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా మృతి

పంజాబ్‌లోని (Punjab) మాన్సా జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గాయకుడు సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) కాంగ్రెస్‌ తరుఫున పోటీ చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థి విజయ్‌ విజయ్ సింగ్లా చేతిలో 63 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Chandigarh, May 29: భద్రత ఉపసంహరించిన మరునాడే పంజాబ్‌ గాయకుడు సిద్ధూ మూసే వాలా (Sidhu Moose Wala) తుపాకీ కాల్పుల్లో మరణించారు. పంజాబ్‌లోని (Punjab) మాన్సా జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గాయకుడు సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) కాంగ్రెస్‌ తరుఫున పోటీ చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థి విజయ్‌ విజయ్ సింగ్లా చేతిలో 63 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే మంత్రి అయిన విజయ్‌ సింగ్లాపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. కాగా, సింగర్‌ సిద్ధూ మూసే వాలా ఆప్‌ను విమర్శిస్తూ గత నెలలో ‘బలిపశువు’ పేరుతో ఒక పాటను విడుదల చేశారు. ఆప్‌ మద్దతుదారులను ద్రోహులుగా అందులో ఆరోపించారు. మరోవైపు సింగర్‌ సిద్ధూ మూసే వాలాతో (Sidhu Moose Wala) సహా 424 మంది వ్యక్తుల భద్రతను పంజాబ్‌ ప్రభుత్వం శనివారం ఉపసంహరించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో ఆదివారం ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్న ఆయనపై గుర్తు తెలియని దుండగులు గన్స్‌తో కాల్పులు జరిపారు. తీవ్ర బులెట్‌ గాయాలైన సిద్ధూ మూసేవాలాను ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఆయన ఇద్దరు స్నేహితులు కూడా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం వారిని మరో ఆసుపత్రికి రిఫర్‌ చేశారు.

Fake Currency: కరెన్సీ తీసుకునేటప్పుడు బీ అలర్ట్, 101 శాతం పెరిగిన నకిలీ కరెన్సీ చలామణి, భారీగా మార్కెట్లో నకిలీ రూ.500 నోట్లు ఉన్నాయంటూ ఆర్బీఐ ప్రకటన 

సిద్దూ మూసేవాలకు లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi gang) గ్యాంగ్‌లో చాలాకాలంగా వైరం ఉంది. దీంతో అతని గ్యాంగ్ సభ్యులే ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం లారెన్స్ గ్యాంగ్ సభ్‌యులు కాల్పులు జరిపినట్లు తెలిసిందన్నారు. ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పుల్లో పాల్పడ్డట్లు చెప్పారు. అతనికి పూర్తి భద్రతను ఉపసంహరించుకోలేదని, ఇద్దరు గన్ మెన్లు ఉన్నారని పంజాబ్ డీజీపీ భర్వా తెలిపారు. అయితే గన్ మెన్లను తన వెంట తీసుకెళ్లకపోవడం వల్లనే కాల్పులకు బలైనట్లు చెప్పారు.