Keerthy Suresh Marriage: నటి కీర్తి సురేష్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తండ్రి సురేష్ కుమార్, వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరుగుతుందని వెల్లడి

కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కీర్తి పెళ్లికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతుండగా దీనిపై అఫిషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కీర్తి పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశారు తండ్రి సురేశ్‌ కుమాస్. వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరుగుతుందని వెల్లడించారు.

Suresh Kumar confirms Keerthy wedding will be held in Goa next month(X)

Hyd, Nov 21:  నటి కీర్తి సురేష్ పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కీర్తి పెళ్లికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతుండగా దీనిపై అఫిషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కీర్తి పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశారు తండ్రి సురేష్ కుమార్. రెడిట్ కథనం ప్రకారం చ్చే నెలలో గోవాలో పెళ్లి జరుగుతుందని సురేష్ వెల్లడించా.

డిసెంబర్ రెండో వారంలో గోవాలోని ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో పెళ్లి జరగనుందని తెలుస్తోంది. డిసెంబర్ 11 లేదా 12న గోవాలో పెళ్లి జరగనుండగా కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. . కీర్తి సురేష్ చిననాటి స్నేహితుడే ఆంటోనీ. వీరిద్దరూ హైస్కూల్‌లో క్లాస్ మేట్స్. వీరిద్దరి మధ్య చాలా కాలం నుండే ప్రేమాయణం కొనసాగుతున్నట్లు తెలిసింది.  చిననాటి స్నేహితుడితో కీర్తి సురేష్ వివాహం, గోవాలో పెళ్లి...మ్యారేజ్ డేట్ ఫిక్స్‌! 

కొచ్చికి చెందిన ఆంటోనీ తటిల్ దుబాయ్‌లో పెద్ద వ్యాపారవేత్త. కైపలాత్ హబీబ్ ఫరూక్‌తో కలిసి చెన్నైలో నమోదైన ఆస్పెరోస్ విండో సొల్యూషన్స్‌కు యజమాని కూడా. నటి మేనక, నిర్మాత జి. సురేష్ కుమార్ కుమార్తె కీర్తి సురేశ్. మలయాళంలో బాలనటిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం అగ్ర హీరోయిన్‌గా రాణిస్తోంది. తెలుగులో ఆమె నటించిన మహానటి సినిమాకు జాతీయ అవార్డు కూడా దక్కింది. బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది కీర్తి సురేష్. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Bengal Women Creates History: మహిళల దేశవాళీ క్రికెట్‌ లో బెంగాల్ టీమ్ నయా చరిత్ర.. హర్యానాపై ఏకంగా 390 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన బెంగాల్

PV Sindhu Marriage: అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం.. ఉద‌య్‌ పూర్‌ లో జ‌రిగిన వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రు.. రేపు హైద‌రాబాద్‌ లో గ్రాండ్ గా రిసెప్ష‌న్