Tamil Nadu Horror: తమిళనాడులో దారుణం, నర్సింగ్ విద్యార్థినిని పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం, విషమంగా బాధితురాలి పరిస్థితి
రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలోని థేనిలో సోమవారం ఓ నర్సింగ్ విద్యార్థినిని దుండగులు ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాలేజీ దగ్గరి నుంచి యువతిని ఎత్తుకెళ్లిన దుండగులు.. గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు
Dindigul, Sep 24: తమిళనాడులో యువతిపై సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలోని థేనిలో సోమవారం ఓ నర్సింగ్ విద్యార్థినిని దుండగులు ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాలేజీ దగ్గరి నుంచి యువతిని ఎత్తుకెళ్లిన దుండగులు.. గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని దిండిగల్ రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.
బాధితురాలి పరిస్థితిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని దిండిగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు దిండిగల్ ఎస్పీ మీడియాకు వెల్లడించారు.
స్థానిక పోలీసులు బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 70, 87 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు అధికారులు సీసీటీవీ ఫుటేజీలు, ఫోన్ సిగ్నల్స్‌ను విశ్లేషిస్తున్నారు.