Rajasthan Shocker: రాజస్థాన్‌లో దిగ్బ్రాంతికర ఘటన, దొంగతనం చేశారని ఇద్దరు వ్యక్తుల మర్మాంగాలలోకి స్క్రూడ్రైవర్‌తో విపరీత చేష్టలు, అపస్మారక స్థితిలో బాధితులు

ఆ సమయంలో బాధితుడు వద్దని ఎంత వేడుకున్నా, వారు కనికరించలేదు.....

Assault | Image used for representational purpose (Photo Credits: IANS)

Jaipur, February 20:  మానవత్వాన్నే మంటగలిపేలా, రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలోని నాగౌర్ ప్రాంతంలో (Nagaur Area) చోటుచేసుకున్న ఓ దిగ్బ్రాంతికర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేశారన్న నెపంతో ఇద్దరు వ్యక్తులను చితకబాదడమే (Physical Assault) కాకుండా వారిని దారుణ చిత్రహింసలకు గురిచేశారు. నాగౌర్ పట్టణంలోని పంచౌడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ దారుణ ఘటన జరిగింది, ఈ క్రూరమైన చర్యకు సంబంధించిన ఆరు వీడియోలు వరుస సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విషయం బయట ప్రపంచానికి తెలిసింది.

నివేదికల ప్రకారం, 18 ఏళ్ల పన్నా రామ్ మరియు 26 ఏళ్ల దిశా రామ్ అనే ఇద్దరు దళిత వర్గానికి చెందిన యువకులు నాగౌర్ పట్టణంలోని ఒక మోటార్ ఏజెన్సీలో చోరీ చేస్తూ పట్టుబడ్డారు. రూ. 50 వేల నగదు దొంగిలించారని వీరిపై అభియోగం. దీంతో ఒక ఏడుమంది కలిసి బాధితులను చితకబాదారు.

అంతేకాదు ఈ ఇద్దరిలో ఒకరిని స్థంభానికి కట్టివేసి, ప్యాంట్ కిందకు లాగి, లోదుస్తులూ తొలగించి, ఒక స్కూడ్రైవర్ (Screwdriver) ను పెట్రోల్ లో ముంచుతూ అతడి మర్మాంగాలలోకి గుచ్చడం ద్వారా నిందితులు పైశాచికానందం నిందితులు పైశాచికానందం పొందుతున్నట్లు ఒక వీడియోలో కనిపించింది. ఆ సమయంలో బాధితుడు వద్దని ఎంత వేడుకున్నా, వారు కనికరించలేదు. నొప్పితో విలవిలలాడుతూ బాధితులిద్దరూ కొద్దిసేపటికీ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు మరొక వీడియోలో కనిపించింది. అయినప్పటికీ ఆ ఏడుగురు వీరిని వదిలిపెట్టలేదు,  బాధితుల మొఖాలపై నీళ్లు చల్లుతూ, బెల్టులతో విచక్షణా రహితంగా దాడి చేసినట్లు వీడియోలలో స్పష్టంగా కనిపిస్తుంది.  హైదరాబాద్‌లో దారుణం, బస్సులో సీట్ అడిగినందుకు మహిళను కత్తితో పొడిచిన వ్యక్తి

వీడియోల ఆధారంగా, బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.సెక్షన్ 323 (హింసకు గురిచేయడం), సెక్షన్ 342 (నిర్బంధించిడం), ఐపిసి సెక్షన్ 143 (చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయడం) తదితర సెక్షన్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు, బాధితులు దళితులు కావడంతో అట్రాసిటీ కేసు కూడానమోదైంది.