Hyderabad, February 18: మనుషులు రోజురోజుకి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.
మహిళల రక్షణ (Women Safety) కోసం ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నేరప్రవృత్తి కల మనుషుల వైఖరి మారడం లేదు. చిన్న విషయానికి బస్సులో ఇద్దరి మధ్య చెలరేగిన ఒక మహిళ ప్రాణం మీదకు తెచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ లోని వెస్ట్ మారేడ్‌పల్లి నివాసి అయిన అనురాధ అనే 34 ఏళ్ల మహిళ సికింద్రాబాద్ నుంచి అఫ్జల్‌గంజ్ వెళ్లే బస్సులో ప్రయాణిస్తుంది. బస్సు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేరుకున్న తర్వాత చాలా మంది ఆడవారు ఎక్కుతున్నారు. అదే క్రమంలో ఓ వ్యక్తి ఆడవాళ్ల మధ్య చొచ్చుకొని వచ్చి మహిళలకు రిజర్వ్ చేయబడిన సీటులో కూర్చున్నాడు. దీంతో అనురాధ, అది మహిళలకు కేటాయించబడిన సీటు, దానిని ఖాళీ చేసి వెనక్కి వెళ్లాల్సిందిగా అతడికి సూచించింది.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు (Tiff over seat) చేసుకుంది. ఇక ఆ వ్యక్తి అనురాధను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడటం మొదలు పెట్టాడు. ఇందుకు ఆగ్రహించిన ఆ మహిళ ఆ వ్యక్తిని తన చెప్పుతో కొట్టింది.
ఈ చర్యతో మరింత రెచ్చిపోయిన ఆ వ్యక్తి, తన జేబులోంచి పదునైన కత్తిలాంటి వస్తువు తీసి ఆ మహిళ కడుపులో పొడిచాడు. దీంతో తీవ్రమైన నొప్పితో కేకలు పెట్టిన ఆ మహిళ ఉన్నచోటునే కుప్పకూలింది. ఏమైందోనని డ్రైవర్ బస్సును అక్కడే నిలిపివేయగా, వెంటనే ఆ వ్యక్తి బస్సు దిగేసి అక్కడ్నించి పరారయ్యాడు. మటన్ కూర తక్కువ వడ్డించిందని భార్యకు నిప్పు పెట్టిన భర్త
వెంటనే డ్రైవర్ బస్సును అక్కడ్నించి సరాసరి అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాడు, రక్తపు మడుగులో ఉన్న ఆ మహిళను పోలీసులు హుటాహుటిన పక్కనే ఉన్న ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చారు. బాధితురాలికి కడుపులో 8 సెంటీమీటర్ల లోతైన గాయం అయినట్లు తెలిపారు. దర్యాప్తు కోసం కేసును బేగం బజార్ పీఎస్‌కు బదలాయించారు.