UPI Server Down: UPI సర్వర్ డౌన్, పనిచేయని GPAY, Phonepe, PAYTM పేమెంట్ యాప్స్, డిజిటల్ చెల్లింపుల్లో సమస్య...

మంగళవారం, UPI ద్వారా చెల్లింపులు చేయడంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. దీనికి కారణం UPI సర్వర్ పనిచేయకపోవడమే..ఈ కారణంగా, Google Pay, Phone Pay, Paytm ద్వారా చెల్లింపులు నిలిచిపోయాయి.

UPI ID (Credits: X)

షాపింగ్ వెళ్తున్నారా..అయితే నగదు తీసుకెళ్లడం మంచిది.. మంగళవారం, UPI ద్వారా చెల్లింపులు చేయడంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. దీనికి కారణం UPI సర్వర్ పనిచేయకపోవడమే..ఈ కారణంగా, Google Pay, Phone Pay, Paytm ద్వారా చెల్లింపులు నిలిచిపోయాయి. వీటిని వినియోగించే వినియోగదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. భారతదేశపు రిటైల్ లావాదేవీలలో 60 శాతానికి పైగా UPI ద్వారానే జరుగుతాయి. ఈ చెల్లింపు వ్యవస్థ పెద్ద మొత్తంలో లావాదేవీలను నిర్వహిస్తుంది. వీటిలో చాలా తక్కువ విలువ కలిగిన లావాదేవీలే. UPI వాల్యూమ్‌లో 75 శాతం వాటా రూ.100 కంటే తక్కువ లావాదేవీలు. 350 కంటే ఎక్కువ బ్యాంకులు UPI ప్లాట్‌ఫారమ్‌కు లింక్ చేయబడ్డాయి. 2025 నాటికి UPI ద్వారా లావాదేవీల సంఖ్య 1 బిలియన్‌కు చేరుకుంటుందని అంచనా.

Iran: ఇరాన్ వెళ్లే భారత టూరిస్టులకు గుడ్ న్యూస్, వీసా లేకుండా 15 రోజుల పాటు నివసించవచ్చు, ఆ తర్వాత అక్కడ ఉండాలంటే..

మంగళవారం యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడంలో ఇబ్బందిగా ఉందని ఫిర్యాదులు చేశాడు. UPI సర్వర్ డౌన్ కావడం వల్ల ఈ అసౌకర్యం ఏర్పడింది. UPI అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ దేశంలో తక్షణ చెల్లింపులు చేయడానికి ఒక మార్గం. ఇది మీ బ్యాంక్ ఖాతా నుండి ఏదైనా ఇతర బ్యాంక్ ఖాతాకు నేరుగా డబ్బును పంపడానికి, స్వీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. UPI లావాదేవీలు IMPS (తక్షణ చెల్లింపు సేవ) ద్వారా ప్రాసెస్ చేయబడతాయి. ఈ సదుపాయం 24 గంటలు, వారంలో ఏడు రోజులు అందుబాటులో ఉంటుంది.