Uttar Pradesh: భార్యను కాటేసిన పాము, దాన్ని సీసాలో బంధించి భార్యతో సహా పామును ఆస్పత్రికి తీసుకువెళ్లిన భర్త, భయంకరమైన పాముని చూసి బిత్తరపోయిన వైద్యులు

యూపీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. త‌న భార్య‌ను కాటేసిన పామును ప‌ట్టుకొని ( Man carries cobra snake) ఓ భ‌ర్త ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. పామును ఇక్కడకు ఎందుకు తెచ్చావ్ అని వైద్యులు అడిగిన ప్రశ్నకు అతను చెప్పిన సమాధానం షాక్ కొట్టినట్లు అయింది

Cobra | Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Lucknow, June 24: యూపీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. త‌న భార్య‌ను కాటేసిన పామును ప‌ట్టుకొని ( Man carries cobra snake) ఓ భ‌ర్త ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. పామును ఇక్కడకు ఎందుకు తెచ్చావ్ అని వైద్యులు అడిగిన ప్రశ్నకు అతను చెప్పిన సమాధానం షాక్ కొట్టినట్లు అయింది. ఘటన వివరాల్లోకెళితే.. సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తన పొలానికి సమీపంలో ఉన్న ఆలయంలో రైతు నిద్రిస్తుండగా పాము కాటేసింది.

దీంతో రామేంద్ర‌యాద‌వ్ పామును ప‌ట్టుకొని ప్లాస్టిక్ సీసాలో బంధించాడు. భార్య‌తోపాటు పామును కూడా స్థానిక ఆస్పత్రికు ( hospital after being bitten) తీసుకెళ్లాడు. పామును ఎందుకు తీసుకొచ్చావ్? అని వైద్యులు అత‌డిని ప్ర‌శ్నించారు. ‘నా భార్య‌కు ఏ పాము క‌రిచింద‌ని మీరు అడిగితే నేనేం చెప్పాలి. అందుకే పామును తీసుకొచ్చాను. ఇక ఏ పాము క‌రిచిందో మీరే చూసుకొని వైద్యం చేయొచ్చు’ అని వింత స‌మాధాన‌మివ్వ‌డంతో వైద్యులు కంగుతిన్నారు.

కులాలు వేరు, అయినా పీకల్లోతు ప్రేమలో మునిగిన మైనర్లు, తల్లిదండ్రులు మందలించడంతో రైలు కిందపడి ఆత్మహత్య, వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన

అత‌ని భార్య ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక పామును స‌మీపంలోని అడ‌విలో విడిచిపెడ‌తాన‌ని రామేంద్ర‌యాద‌వ్ మీడియాతో తెలిపాడు. పాముకు ఊరిరాడేలా ప్లాస్టిక్ బాటిల్‌కు రంధ్రాలు చేశాన‌ని చెప్పుకొచ్చాడు. కాగా, ఈ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా పాము కాటుకు గురైన గ్రామస్తుల్లో కొందరిని కాటు వేసిన పాము ఆకారం, పరిమాణంపై వైద్యుల అడుగుతున్నారని పాము కాటు బాధితులు చెప్పడంతో ఈ పనిచేశానని చెప్పడం అతని ముందు చూపుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Foundation To Osmania Hospital New Building: ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి, గోషామహల్‌ స్టేడియంలో 2వేల పడకల కెపాసిటీతో నిర్మాణం

YSRCP Fees Poru: ఫిబ్రవరి 5న వైఎస్సార్‌సీపీ ఫీజుపోరు, రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన జగన్ పార్టీ, చంద్రబాబు పాలనలో విద్యార్థులు కూలీలుగా మారుతున్నారని మండిపాటు..

MP Rakesh Rathore Arrested: వీడియో ఇదిగో, మహిళపై నాలుగేళ్లుగా కాంగ్రెస్ ఎంపీ అత్యాచారం, రాకేశ్‌ రాథోడ్‌‌ని అరెస్ట్ చేసిన పోలీసులు, బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన అలహాబాద్‌ హైకోర్టు

Peddireddy Ramachandra Reddy: సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారు, చంద్రబాబు సర్కారుపై మండిపడిన పెద్దిరెడ్డి, ఏడు నెలల్లో రూ.1.19లక్షల కోట్లు అప్పు చేశారని వెల్లడి

Share Now