Uttar Pradesh: మహిళతో ఏకాంతంగా..,రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ మరిది, బట్టలు చించేసి నగ్నంగా ఊరేగింపు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో

పరాయి మహిళతో అక్రమ సంబంధం (extramarital affair) కొనసాగిస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవటంతో జనం ఆ వ్యక్తి బట్టలు చించేసి నగ్నంగా ఊరేగించారు . ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగించే వారికి ఇది నిజంగా చెంపపెట్టులాంటి వార్తే..

Man paraded naked after being caught with illicit lover in Agra..Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Lucknow, Febuary 27: పరాయి మహిళతో అక్రమ సంబంధం (extramarital affair) కొనసాగిస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవటంతో జనం ఆ వ్యక్తి బట్టలు చించేసి నగ్నంగా ఊరేగించారు . ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగించే వారికి ఇది నిజంగా చెంపపెట్టులాంటి వార్తే..

ఆగ్రా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆగ్రాలోని (Agra) ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికి అదే గ్రామంలో ఉంటున్న పరాయి మహిళతో అతను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇద్దరూ ఏకాంతంగా కలిసి కబుర్లు చెప్పుకుంటున్నారు. కాగా ఆ మహిళ మరిది వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అతడితో కలిసిన కొంతమంది ఊరి జనం నిందితుడిని పట్టుకుని విపరీతంగా చితకబాదారు. బట్టలు పూర్తిగా చించేసి, గ్రామంలోని వీధుల గుండా నగ్నంగా తిప్పారు.

ఈ ఊరేగింపునంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో ఉంచారు. అనంతరం మహిళ బంధువు ఒకరు నిందితుడికి వ్యతిరేకంగా పోలీస్‌ స్టేషన్‌లో అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు అతడ్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు జైలుకు తరలించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది. దీంతో వీడియో ఆధారంగా నిందితుడిపై దాడికి పాల్పడ్డవారిని గుర్తించిన పోలీసులు వీలైనంత త్వరగా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement