UP Shocker: ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటున్న మూడేళ్ల మేనకోడలు, తలుపులేసి దారుణంగా అత్యాచారం చేసిన మేనమామ, నిందితుడిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

తాజాగా దారుణ ఘటన చోటు చేసుకుంది. బులంద్‌షహర్‌లోని తన మూడేళ్ల మేనకోడలిపై కామాంధుడు దారుణంగా అత్యాచారం ( Man arrested for raping) చేశాడు.

Image used for representational purpose | (Photo Credits: File Image)

Lucknow, April 18: యూపీలో మ‌హిళలు, బాలిక‌లు, చిన్నారుల‌పై లైంగిక దాడుల ఘ‌ట‌న‌లు కొన‌సాగుతున్నాయి. తాజాగా దారుణ ఘటన చోటు చేసుకుంది. బులంద్‌షహర్‌లోని తన మూడేళ్ల మేనకోడలిపై కామాంధుడు దారుణంగా అత్యాచారం ( Man arrested for raping) చేశాడు. ఆమె తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో బాలిక (three-year-old niece ) ఒంట‌రిగా ఇంట్లో ఉన్న స‌మ‌యంలో మేన‌మామ లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. కామాంధులకు ఇదేమి పోయకాలం, మానిటర్ బల్లిపై నలుగురు దారుణంగా అత్యాచారం, ఈ రేప్ ఘటనను వీడియోలో చిత్రీకరించిన కామాంధులు, వీడియో చూసి షాక్ తిన్న మహారాష్ట్ర పోలీసులు

అనుప్‌షహర్ డోగ్రా జోగి గ్రామంలో మూడేండ్ల చిన్నారిపై కామంతో కండ్లు మూసుకుపోయిన మామ లైంగిక దాడికి పాల్ప‌డ‌టం క‌ల‌కలం రేపింది. పొలం ప‌నుల‌కు వెళ్లి తిరిగి వ‌చ్చిన చిన్నారి త‌ల్లితండ్రుల‌కు నిందితుడు ప‌రార‌వుతూ ప‌ట్టుబ‌డ్డాడు. నిందితుడిని స్దానికులు తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్ప‌గించారు. బాలిక‌ను వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం బులంద్‌ష‌హ‌ర్ జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఏప్రిల్ 18న నిందితుడిని అరెస్ట్ చేశారు.