Uttar Pradesh Shocker: మసీదు వెనకకు తీసుకెళ్లి ఆరేళ్ల చిన్నారిపై ఇమాం అత్యాచారం, పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు అరెస్ట్
మసీదులో పనిచేసే ఇమాం (Religious Teacher in UP) ఓవైస్ తన కూతురిపై బుధవారం లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Sambhal, July 28: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సంభాల్‌లో ఆరేండ్ల బాలికపై మసీదులో పనిచేసే ఇమాం లైంగిక దాడికి (Minor Girl Raped) పాల్పడ్డాడు. మసీదులో పనిచేసే ఇమాం (Religious Teacher in UP) ఓవైస్ తన కూతురిపై బుధవారం లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మసీదు సమీపంలోని తన గదిలోకి బాలికను తీసుకువెళ్లిన నిందితుడు ఆమెపై దారుణానికి (Minor girl raped by religious teacher) ఒడిగట్టాడని జిల్లా ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపారు.
బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మెడికల్ రిపోర్ట్ అందిన వెంటనే తదుపరి దర్యాప్తు ముమ్మరం చేపడతామని చెప్పారు.ఫిర్యాదు మేరకు ఐపీసీ 376 (అత్యాచారం), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపారు.
ఇక రెండు రోజుల క్రితం నోయిడాలో స్కూల్‌కు వెళ్తున్న బాలికపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అరెస్ట్ నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. 12 ఏళ్ల బాలిక బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్తున్నది. 20 ఏళ్ల వ్యక్తి ఆమెను కలిసి మాయ మాటలు చెప్పాడు. సెక్టార్ 32లోని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌కు వ్యాన్‌లో తీసుకెళ్తుండగా తప్పించుకునేందుకు నిందితుడు ప్రయత్నించాడు. దీంతో చుట్టుముట్టిన పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా వారిపై రాళ్ల దాడి చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు గన్‌తో కాల్పులు జరుపగా నిందితుడు గాయపడ్డాడు. అతడ్ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లైంగిక దాడి, పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.