Representational Image. (photo credit- IANS)

Delhi, July 28: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. తినేందుకు రోటీ ఇవ్వలేదనే కోపంతో (Man Refuses To Share A Roti) ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశాడు. కరోల్‌ బాఘ్‌ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ‘రిక్షాలో ఇద్దరు వ్యక్తులు భోజనం చేస్తున్నారు. ఫూటుగా మద్యం తాగిన మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. తనకు భోజనం పెట్టాలని అడిగాడు. 40 ఏళ్ల మున్నా అనే వ్యక్తి రోటీ ఇచ్చాడు. మరో రోటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అందుకు మున్నా నిరాకరించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తన వద్ద ఉన్న కత్తిని (Stabbed To Death) తీసి మున్నాను పొడిచాడు.’ అని డిప్యూటీ కమిషనర్‌ శ్వేతా చౌహాన్‌ తెలిపారు. దారుణం.. శవాలుగా చెట్టుకు వేలాడుతూ ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఆత్మహత్య చేసుకున్నారా? హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తీవ్రంగా గాయపడిన బాధితుడు మున్నాను ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడు ఆగ్రాకు చెందిన 26 ఏళ్ల ఫెరోజ్‌ ఖాన్‌గా గుర్తించారు. కరోల్‌ బాఘ్‌లోని ఓ పార్క్‌లో నిద్రిస్తున్న ఖాన్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మరో రోటీ ఇవ్వాలేదనే కోపంతో అతను చంపాడని సెంట్రల్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ శ్వేతా చౌహాన్ తెలిపారు.