IPL Auction 2025 Live

Uttar Pradesh: యూపీలో దారుణం, ఉదయం భర్త బాగుండాలని పూజలు చేసి సాయంత్రం విషమిచ్చి చంపిన భార్య

భర్త క్షేమం, దీర్ఘాయుష్షు కోసం చేసే కర్వా చౌత్ సందర్భంగా ఒక మహిళ రోజంతా ఉపవాసం ఉండి పూజలు చేసింది. అనంతరం భర్తకు విషమిచ్చి చంపింది.

Image used for representational purpose | (Photo Credits: PTI)

Lucknow, Oct 21: కడ ధామ్ పోలీస్ స్టేషన్‌ పరిధికి చెందిన 32 ఏళ్ల శైలేష్ కుమార్, అతడి భార్య సవిత ఆదివారం కర్వా చౌత్ ఆచరించారు. ఈ సందర్భంగా భర్త దీర్ఘాయుష్షు కోసం సవిత పూజలు చేయడంతోపాటు ఉపవాసం కూడా ఉన్నది. శైలేష్ కూడా భార్య పూజల కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు.

ఆదివారం సాయంత్రం సవిత ఉపవాసాన్ని విరమించింది.అయితే కొద్ది సేపటికే భర్త శైలేష్‌తో ఆమె వాగ్వాదానికి దిగింది. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేశారు. అయితే తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని సవిత అనుమానించింది. ఈ నేపథ్యంలో విషం కలిపిన ఆహారాన్ని అతడికి పెట్టింది. భోజనం తర్వాత పొరుగింటికి వెళ్లి ఏదో తీసుకురమ్మని భర్తను పంపింది.

వీడియో ఇదిగో, కారు టైర్ మారుస్తున్న డ్రైవర్‌ని ఢీకొన్న మరో కారు, ఎగిరి అవతల పడి అక్కడికక్కడే మృతి

అతడు బయటకు వెళ్లగానే ఆ ఇంటి నుంచి ఆమె పారిపోయింది.ఈ ఆహారం తిన్న శైలేష్‌ కొంత సేపటికి తీవ్ర అవస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయం తెలిసిన సోదరుడు అతడ్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. విషం కలిపిన ఆహారాన్ని భార్య పెట్టిందని శైలేష్‌ చెప్పగా సోదరుడు ఫోన్‌లో రికార్డ్‌ చేశాడు. ఆ తర్వాత చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు శైలేష్‌ భార్య సవితను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



సంబంధిత వార్తలు

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్

Ambati Rambabu: అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయరా ? పోలీసులకు సూటి ప్రశ్న విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు

Sambhal Shahi Jama Masjid Survey: యూపీలో మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులపై రాళ్లు రువ్విన స్థానికులు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, వీడియోలు ఇవిగో..