Uttarakhand Horror: నిర్భయ కన్నా దారుణమైన ఘటన, కదులుతున్న కారులో తల్లీ, కూతురిపై దారుణంగా అత్యాచారం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రెచ్చిపోయిన కామాంధులు

కదులుతున్న వాహనాలే వారికి అత్యాచార వేదికలుగా మారుతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ జిల్లాలో కదులుతున్న కారులో మహిళ, ఆమె కుమార్తెపై కొందరు సామూహిక లైంగిక దాడికి (Woman, 6-Year-Old Daughter Gangraped ) పాల్పడ్డారు.

Rape Representative image.

Dehradun, June 27: దేశంలో మృగాళ్లలో మార్పు రావడం లేదు. అత్యాచారాలు ఆగడం లేదు. కదులుతున్న వాహనాలే వారికి అత్యాచార వేదికలుగా మారుతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ జిల్లాలో కదులుతున్న కారులో మహిళ, ఆమె కుమార్తెపై కొందరు సామూహిక లైంగిక దాడికి (Woman, 6-Year-Old Daughter Gangraped ) పాల్పడ్డారు. రూర్కీలోని ముస్లిం మతపర ప్రాంతం పిరాన్ కలియార్ నుంచి ఒక మహిళ ఆరేళ్ల కుమార్తె కలిసి ఆదివారం రాత్రి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నది.

కారులో అటుగా వెళ్తున్న సోనూ అనే వ్యక్తి వారికి లిఫ్ట్‌ ఇచ్చాడు. అతడి అనుచరులు కూడా ఆ కారులో ఉన్నారు. కదులుతున్న కారులో మహిళ, ఆమె కుమార్తెపై సామూహిక లైంగిక దాడికి (Gangraped In Moving Car ) పాల్పడ్డారు. అనంతరం ఒక కాలువ సమీపంలో వారిద్దరిని పడేసి వెళ్లిపోయారు. కాగా, బాధిత మహిళ, కుమార్తెతో కలిసి అతికష్టం మీద అర్ధ రాత్రి వేళ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంది.

అది లేదని.. ప్రియురాలి కోసం లింగ మార్పిడి చేసుకున్న యువతి, టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ థెరపీ చేసిన వైద్యులు, ప్రక్రియ పూర్తి కావడానికి 18నెలల సమయం

జరిగిన దారుణాన్ని పోలీసులకు చెప్పింది. కారు డ్రైవ్‌ చేసిన వ్యక్తి పేరు సోనూ అని ఫిర్యాదు చేసింది. దీంతో బాధిత మహిళ, ఆమె కుమార్తెను రూర్కీ సివిల్‌ హాస్పిటల్‌కు తరలించారు. వారిపై సామూహిక లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షలో నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement