Lucknow, June 27: ఉత్తరప్రదేశ్‍లోని ప్రయాగ్ రాజ్‌కు చెందిన యువతి.. తన ప్రియురాలితో కలిసి బతికేందుకు లింగమార్పిడి (woman switches gender) చేయించుకుంది. లెస్బియన్లుగా ఉన్న వారి రిలేషన్‌షిప్‌కు ఇరు కుటుంబాల పెద్దలు ( girlfriend after families oppose relation) నిరాకరించారు. ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ ఉండటంతో ఎటువంటి ఇబ్బందినైనా ఎదుర్కొనేందుకు రెడీగా అయ్యారు. ఒకరితో ఒకరిని కలవనీయకుండా కట్టడి చేయడంతో పరిష్కారం గురించి ఆలోచించారు.నచ్చజెప్పడానికి ప్రయత్నించినా.. వినకపోవడంతో ఓ యువతి లింగమార్పిడికి సిద్ధమైంది.
ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్‌లో డాక్టర్ల టీం సర్జరీ నిర్వహించారు. ఛాతీతో పాటు ఇతర శరీర భాగాలను మార్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సర్జరీ పూర్తి కావడానికి 1.5సంవత్సరాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. ఆ మహిళకు టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ థెరపీ చేశారు. ఫలితంగా చాతిపై వెంట్రుకలు పెరుగుతాయని వైద్యులు వెల్లడించారు.
లింగమార్పిడి తర్వాత ఆ మహిళ గర్భం దాల్చడం వంటి అవకాశాలు కోల్పోయింది. ఇటువంటి ఆపరేషన్ జరగడం ఇదే తొలిసారి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 18నెలల సమయం పడుతుంది. ఆమెకు పూర్తి వైద్య పరీక్షలు జరిపాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు.