Ram Mandir Inauguration: రామమందిర ప్రారంభోత్సవానికి రానున్న ఎల్‌కే అద్వానీ, ఆయన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ట్రస్టు

అయోధ్య (Ayodhya) రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ కీలకనేత ఎల్‌కే అద్వానీ (LK Advani) హాజరు కానున్నారా..? అంటే అవుననే అంటున్నాయి విశ్వహిందూ పరిషత్‌ (VHP) వర్గాలు. జనవరి 22న ప్రధాని మోదీ సమక్షంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ నేత అద్వానీ హాజరుకానున్నట్లు వీహెచ్‌పీ ఓ ప్రకటనలో తెలిపింది.

LK Advani and MM Joshi (Photo-X)

New Delhi, JAN 11:  అయోధ్య (Ayodhya) రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ కీలకనేత ఎల్‌కే అద్వానీ (LK Advani) హాజరు కానున్నారా..? అంటే అవుననే అంటున్నాయి విశ్వహిందూ పరిషత్‌ (VHP) వర్గాలు. జనవరి 22న ప్రధాని మోదీ సమక్షంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ నేత అద్వానీ హాజరుకానున్నట్లు వీహెచ్‌పీ ఓ ప్రకటనలో తెలిపింది. అయోధ్య రామాలయం అంశం ఎప్పుడు, ఎక్కడ చర్చకు వచ్చినా వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి (Murli Manohar Joshi). అయితే వయోకారణాల దృష్యా వారిద్దరిని ఈ వేడుకకు రావద్దని చెప్పడం రామజన్మభూమి క్షేత్ర ట్రస్టు చెప్పడం పెద్ద దుమారం రేపింది. దీంతో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

 

96 ఏండ్ల అద్వానీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని వీహెచ్ పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ (Alok Kumar) అన్నారు. ఆయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఈ నెల 16 నాటికి పూర్తికానున్నాయి. అదే రోజునుంచి ఆలయంలో మూల విరాట్‌ల ప్రాణ ప్రతిష్ఠ పూజలు ప్రారంభం అవుతాయి. అనంతరం జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు దలైలామా, మాతా అమృతానందమయి, యోగా గురువు బాబా రాందేవ్‌, సినీ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌, రజినీకాంత్‌, మాధురీ దీక్షిత్‌, అరుణ్‌ గోవిల్‌, ప్రభాస్‌, దర్శకుడు మాధుర్‌ భండార్కర్‌, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేశ్‌ అంబానీతో సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆలయ ట్రస్టు ఆహ్వానించింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

PM Modi: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అని ట్వీట్

Karimnagar Graduate MLC Election: కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధించిన అంజిరెడ్డి

Nadendla Manohar Slams YS Jagan: తాడు బొంగరం లేని పార్టీ మీ వైసీపీ, జగన్ వ్యాఖ్యలపై నాదెండ్ల మనోహర్ మండిపాటు, నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా? అంటూ కౌంటర్

SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌ రెండ్రోజుల్లో పూర్తి చేస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన, రాజకీయం చేయడానికి హరీశ్‌రావు వచ్చారని మండిపాటు

Advertisement
Advertisement
Share Now
Advertisement