Vishwambhara Teaser: విశ్వంభ‌ర వ‌చ్చేస్తున్నాడు, టీజ‌ర్ ముహూర్తం ఖ‌రారు చేసిన మేక‌ర్స్, ద‌స‌రాకు ఇక మెగాఫ్యాన్స్ కు పూన‌కాలే

ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా టీజ‌ర్‌ను రేపు ఉద‌యం 10 గంట‌ల 49 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించింది.

Vishwambhara Teaser

Hyderabad, OCT 11: మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియ‌న్ మూవీ ‘విశ్వంభ‌ర’ టీజ‌ర్ (Vishwambhara Teaser) టైం వ‌చ్చేసింది. ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా టీజ‌ర్‌ను రేపు ఉద‌యం 10 గంట‌ల 49 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించింది. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇప్ప‌టికే స‌గానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రెండు పాట‌లు, క్లైమాక్స్ షూట్ మిగిలిఉన్న‌ట్లు తెలిపింది.

Vishwambhara Teaser @ Tomorrow 10:49 AM 

 

 

ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుక‌గా తీసుకురానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. యూవీ క్రియేషన్స్‌ (UV Creations) బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తున్నారు.