West Bengal: బిర్యానీలో వాడే మసాలాలతో అది పనిచేయదట, లైంగిక కోరికలు పూర్తిగా తగ్గిపోతాయట, పశ్చిమ బెంగాల్‌లో బిర్యానీ షాపులను మూసి వేయించిన కుచ్‌బెహార్ మున్సిపాలిటీ చైర్మన్ రవీంద్రనాథ్ ఘోష్
పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్, కుచ్‌బెహార్ మున్సిపాలిటీ చైర్మన్ రవీంద్రనాథ్ ఘోష్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.
Coochbehar, Oct 24: పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్, కుచ్‌బెహార్ మున్సిపాలిటీ చైర్మన్ రవీంద్రనాథ్ ఘోష్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. బిర్యానీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల వల్ల పురుషుల్లో లైంగిక కోరికలు తగ్గుతున్నాయని (biryani spices reduce male sex drive) కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని కారణంగా చూపుతూ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓ బిర్యానీ షాపులను (TMC leader forces biryani shop to shut down) మూసివేయించారు.
కాగా, రవీంద్రనాథ్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఘోష్ మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో కోల్‌కతా బిర్యానీ షాపులకు పోటీగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కొందరు వ్యాపారులు అక్రమంగా బిర్యానీ సెంటర్లను నడుపుతున్నారు. లైసెన్సులు లేకుండానే బిర్యానీ షాపులను నిర్వహిస్తున్నారు. వారు చేసే బిర్యానీలను తినడం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుందని ఫిర్యాదులు వస్తున్నాయి.
అందుకే, వారి షాపులను మూసివేయిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై బెంగాల్‌కు చెందిన మాజీ మంత్రి మాట్లాడుతూ బిర్యానీల్లో వాడే మసాలాలతో లైంగిక సామర్థ్యం తగ్గుతుందనడానికి ఆధారాలు లేకపోయినప్పటికీ, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా షాపులను మూసివేయినట్టు తెలిపారు.