Shameful Act: ఫేస్‌బుక్ పరిచయం, ఇద్దరు ప్రియులతో వివాహిత అక్రమ సంబంధం, అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారి ఉసురుతీసిన వైనం. మేడ్చల్ హత్యోదంతంలో వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు!

తెలంగాణలోని భువనగిరికి చెందిన కళ్యాణ్‌కు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన అనూష అనే యువతికి కొన్నేళ్ల కిందట ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది, వీరి పరిచయం ప్రేమగా మారి ...

Image used for representational purpose only. | File Photo

Medchal, July 03:  ఎటుపోతున్నాయో మానవ సంబంధాలు, ఏమైపోతున్నాయో విలువలు, ఏ మృగంలో లేని క్రూరత్వం కొన్ని సార్లు మనిషిలో బయటపడుతున్నాయి. మనం మనుషులం అని చెప్పుకోటానికే సిగ్గుపడేలా చేస్తున్నాయి కొన్నిఘటనలు.

ప్రేమ వివాహం చేసుకున్న ఓ వివాహిత మరో ఇద్దరు యువకులతో పెట్టుకున్న అక్రమ సంబంధం.. లోకం తెలియని, ఏ నేరం చేయని  ఓ చిన్నారిని బలితీసుకున్నాయి. హైదరాబాద్ నగరాన్ని ఆనుకొని ఉండే మేడ్చల్ జిల్లాలో జూలై 2న, గురువారం మధ్యాహ్నం ఆద్య అనే 5 ఏళ్ల చిన్నారిని ఓ ఉన్మాది గొంతుకోసి చంపాడు. ఈ ఘటన సమాజాన్ని నివ్వెరపోయేలా చేశాయి.

వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలోని భువనగిరికి చెందిన కళ్యాణ్‌కు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన అనూష అనే యువతికి కొన్నేళ్ల కిందట ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది, వీరి పరిచయం  ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లికూడా చేసుకున్నారు. వీరి ప్రేమకు ప్రతిరూపంగా ఆద్య అనే చిన్నారి కూడా పుట్టింది. ఇంతవరకూ వీరిది అందమైన ప్రేమకథ.

అయితే ఆ మహిళ చేసిన తప్పులతో ఆమె కథ వికృత రూపం దాల్చింది. పెళ్లి జరిగి కూతురు ఉన్నప్పటికీ కూడా ఆమె ఫేస్‌బుక్ ద్వారా కరుణాకర్ అనే మరో యువకుడితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తూ వచ్చింది. భర్త ఆఫీసుకు వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో అక్రమ సంబంధం నెరిపింది. ఇదే క్రమంలో ప్రియుడు కరుణాకర్ తన స్నేహితుడిని మహిళకు పరిచయం చేశాడు. దీంతో మెల్లిమెల్లిగా అనూష కరుణాకర్‌ను దూరం పెట్టి రాజశేఖర్‌కు దగ్గరవుతూ వచ్చింది. ఇది కరుణాకర్ తట్టుకోలేకపోయాడు.

అనూష భర్త ఇంట్లో లేని సమయంలో ఖచ్చితమైన అవగాహనతో గురువారం మధ్యాహ్నం 12:30 సమయానికి అనూష ఇంటికి కరుణాకర్ వచ్చాడు, అతడు అనుమాన పడ్డట్లుగానే రాజశేఖర్‌తో అనూష సన్నిహితంగా మెలుగుతున్నట్లు గమనించాడు.

మరోవైపు కరుణాకర్ రాకను కూడా గమనించిన అనూష, తన రెండో ప్రియుడ్ని బాత్‌రూంలో దాచిపెట్టే ప్రయత్నం చేసింది. అయితే కరుణాకర్ అతణ్ని బయటకు రావాల్సిందిగా పిలిచాడు, లేకపోతే చిన్నారి ఆద్యను చంపేస్తానని బెదిరించాడు. వారి నుంటి ఎలాంటి స్పందన లేకపోవడంతో కరుణాకర్ అన్నంత పనీ చేశాడు. తనవెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడ్‌తో చిన్నారి ఆద్య గొంతు కోశాడు. దీంతో భయభ్రాంతులకు గురైన అనూష బిగ్గరగా కేకలు వేసింది, ఆ కేకలతో రాజశేఖర్ బయటకు వచ్చాడు. దీంతో కరుణాకర్ అందరినీ ఆ కత్తితో గాయపరిచి, అనంతరం బయటకు వచ్చి తాను గొంతుకోసుకున్నాడు.

అప్పటికే రక్తమడుగులో చిన్నారి ఆద్య విగతజీవిగా మారింది.  ఈ హఠాత్పరిణామాలతో ఆందోళన చెందిన కాలనీవాసులు  వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వచ్చి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  ముందుగా వీరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మల్కాజ్‌గిరి డీసీపీ రక్షితామూర్తి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ వీరు ముగ్గురూ గతంలోనే స్నేహితులని తెలిపారు.  ఈ విషయాలేవి అనూష భర్తకు తెలియవని వెల్లడించారు. తదుపరి విషయాలను తర్వాత వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం నిందితుల జాబితా ఇదే, ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-18గా మైత్రీ మూవీస్‌