Another 'Disha': చేవెళ్ల సమీపంలో బ్రిడ్జి కింద వివస్త్రగా యువతి మృతదేహం లభ్యం, అత్యాచారం- హత్యగా పోలీసుల అనుమానం, దిశ సంఘటనను గుర్తు చేస్తున్న దారుణం

అలాగే చుట్టుపక్కల ఇతర పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు, ఎవరైనా యువతి మిస్సింగ్ కేసుల పట్ల అని ఆరా తీశారు.....

Image used for representational purpose only. | File Photo

Hyderabad, March 17: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల (Chevella) మండలం, తంగడపల్లి సమీపంలో ఓ యువతి హత్య (Murder) జరిగింది. ఈ దారుణం దిశ సంఘటనను పోలి ఉంది. స్థానికుల ద్వారా మంగళవారం ఉదయం 7:30 సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే, మంగళవారం ఉదయం తంగడపల్లి శివారులోని వంతెన (Tangadapally Bridge)  కింద సుమారు 25- 30 ఏళ్ల మధ్య ఉండే గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మహిళ అక్కడ వివస్త్రగా పడి ఉంది, అంతేకాకుండా యువతి ఆనవాళ్లు తెలియకుండా దుండగులు ఆమె మొఖాన్ని బండరాయితో మోది చిద్రం చేశారు. దీని ప్రకారం ముందు ఆమెపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. క్రైమ్ సైట్ వద్ద యువతికి సంబంధించిన ఆకుపచ్చ చీర లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటికీ యువతి వివరాలేమి ఇంకా తెలియరాలేదు. దగ్గర్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే చుట్టుపక్కల ఇతర పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు, ఎవరైనా యువతి మిస్సింగ్ కేసుల పట్ల అని ఆరా తీశారు.

ఘటనాస్థలంలో క్లూస్ టీం కొన్ని ఆధారాలను సేకరించింది. అయితే, పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ రిపోర్టుల ఆధారంగా యువతిపై అత్యాచారం జరిగిందా? లేదా? అనే విషయం తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు, ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని, త్వరలోనే అన్ని విషయాలు తేలుస్తామని స్పష్టం చేశారు.

ప్రస్తుతం కరోనావైరస్ వార్తలు ఎక్కువగా ఉండటంతో, ఈ దారుణ ఘటన ఎక్కువగా ఫోకస్ చేయబడలేదు. గతేడాది చివర్లో ఇదే తరహాలో ఓ వంతెన కింద 'దిశ హత్యాచారం' ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆనాడు నలుగురు  కలిసి దిశపై అత్యాచారం చేసి తర్వాత ఆమెను చటాన్‌పల్లి సమీపంలో వంతెన కింద నిప్పుపెట్టారు. ఆ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆ నలుగురు నిందితులు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif