Mouth-to-Mouth CPR to Snake: పాము నోట్లో నోరు పెట్టి శ్వాస అందించిన యువ‌కుడు, చ‌నిపోతున్న స‌ర్పాన్ని తిరిగి బ్రతికించాడు (వీడియో ఇదుగోండి)

గుజ‌రాత్ వ‌డోద‌రాలో (Vadodara) ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్ లో వైర‌ల్ గా మారింది.

Mouth-to-Mouth CPR to Snake

Vadodara, OCT 17: ప్రాణాపాయంలో ఉన్న వ్య‌క్తుల‌కు సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) చేసి ప్రాణాలు కాపాడ‌టం చూశాం. చావు అంచుల వ‌ర‌కు వెళ్లిన వారికి ప్రాణాలు పోసే ఈ ప్ర‌క్రియ‌ను జంతువుల‌కు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని చాలా మందికి తెలియ‌దు. అయితే పాము క‌నిపిస్తే రాళ్ల‌తో కొట్టి చంపే మ‌నుషులున్న ఈ ప్ర‌పంచంలో..తుది శ్వాస విడుస్తున్న పాముకు సీపీఆర్ చేసి (CPR to Snake) ప్రాణాలు పోశాడు ఓ యువ‌కుడు. గుజ‌రాత్ వ‌డోద‌రాలో (Vadodara) ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్ లో వైర‌ల్ గా మారింది.

Mouth-to-Mouth CPR to Snake

 

దాదాపు చ‌నిపోయింద‌నుకున్న పాముకు నోటి ద్వారా శ్వాస అందించి బ‌తికించాడు య‌శ్ త‌డ్వి (Yash Tadvi) అనే యువ‌కుడు. పాముల‌ను రెస్క్యూ చేసే ఎన్జీవోలో చేసే య‌శ్ కు ఓ కాల్ వ‌చ్చింది. వెంట‌నే అక్క‌డికి వెళ్లిన అత‌ను..నిర్జీవంగా ఉన్న పామ‌ను చూసి వెంట‌నే రియాక్ట్ అయ్యాడు. ఆ పాము ఇంకా బ‌తికే ఉందని గుర్తించి శ్వాస అందించాడు. దీన్ని అక్క‌డే ఉన్న‌వాళ్లు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పాము విష‌పూరిత‌మైన‌ది కాదని, చెరువులు, కొల‌నుల్లో ఉండే నీటిపాము అని తెలిపాడు య‌శ్.