Pune Shocker: జొమాటో డెలివరీ బాయ్ పాడు పని, యువతి ఇంట్లో ఒంటరిగా ఉందని లైంగిక దాడి, వెనక నుంచి వాటేసుకుని ముద్దులు పెడుతూ నీచ ప్రవర్తన
యేవెల్వాడీ ప్రాంతంలో ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లిన ఓ 42 ఏళ్ల డెలివరీ ఏజెంట్.. 19 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
Pune, Sep 20: పుణేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యేవెల్వాడీ ప్రాంతంలో ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లిన ఓ 42 ఏళ్ల డెలివరీ ఏజెంట్.. 19 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ యువతికి బలవంతంగా ముద్దు పెట్టినట్లు (Forcibly Kissing Girl Customer) పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్‌ని అరెస్ట్ (Zomato Delivery Man Arrested) చేసినట్లు చెప్పారు.
బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఆహారం డెలివరీ చేసేందుకు 42 ఏళ్ల వ్యక్తి ఓ ఇంటికి వెళ్లాడు. యువతి ఆ ఆర్డర్ తీసుకోగానే దాహం వేస్తుందని, మంచి నీళ్లు ఇవ్వాలని కోరాడు. మంచి నీళ్లు తెచ్చి ఇచ్చిన క్రమంలో కుటుంబ సభ్యుల గురించి అడగటం మొదలు పెట్టాడు. తను ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ ఫ్లాట్‌లో నివసిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం వారు సొంత ఊళ్లకు వెళ్లారని వెల్లడించింది.
దీంతో ఒంటరిగా ఉందని గ్రహించిన నిందితుడు.. మరో గ్లాస్ మంచి నీళ్లు ఇవ్వాలని కోరాడు. గ్లాస్ తీసుకుని వెనక్కి తిరిగిన క్రమంలో వెనక నుంచి గట్టిగా పట్టుకుని రెండు సార్లు బలవంతంగా చెంపపై ముద్దు పెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఈ సంఘటన సెప్టెంబర్ 17న రాత్రి 9.30 గంటలకు జరిగింది. బాధితురాలి ఇంటి నుంచి వెళ్లిన డెలివరీ బాయ్.. ఆమెకు వాట్సాప్ ద్వారా సందేశాలు పంపటం ప్రారంభించాడు. ఎలాంటి సాయం కావాలన్న అడగాలని చెప్పేవాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జొమాటో డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేయగా.. తర్వాత బెయిల్‌పై విడుదలైనట్లు సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సర్దార్ పాటిల్ తెలిపారు.