Aadhaar Linking To Social Media: సోషల్ మీడియాకు ఆధార్ లింక్ అనుసంధానించే ఆలోచనేది లేదు, పౌరుల గోప్యత హక్కును రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడి
అయితే వీటిపై కేంద్ర ప్రభుత్వం (Central government) అధికారికంగా ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కాగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ (Union Minister Ravi Shankar Prasad) దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించే ఆలోచన ( no plans to link Aadhaar with social media account) ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.
New Delhi,November 20: గత కొంత కాలంగా సోషల్ మీడియాకు ఆధార్ అనుసంధానం(Aadhaar Linking To Social Media) ఇస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీటిపై కేంద్ర ప్రభుత్వం (Central government) అధికారికంగా ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కాగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ (Union Minister Ravi Shankar Prasad) దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించే ఆలోచన ( no plans to link Aadhaar with social media account) ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.
ఆధార్ (Aadhaar) సమాచారం పూర్తి భద్రతతో కూడుకున్నదని దీనిపై తరచుగా ఆడిటింగ్ జరుగుతుందని పార్లమెంట్‌లో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. ఐటీ చట్టం సెక్షన్ 69 ఏ కింద ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని చెప్పారు.
2016 నుంచి 2019 వరకూ ప్రభుత్వం దాదాపు 8500 వరకూ యూఆర్‌ఎల్‌లను బ్లాక్ చేసిందని ఈ సంధర్భంగా వెల్లడించారు. కాగా ఇజ్రాయిల్‌కు చెందిన స్పైవేర్ ( Israeli spyware) భారత్‌కు చెందిన 121 మంది ఫోన్‌లను ఎటాక్ చేసేందుకు చేసిన ప్రయత్నాలను ప్రభుత్వం గుర్తించిందని, తమ పౌరుల గోప్యత హక్కును రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ (AIMIM leader Asauddin Owaisi) అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మంత్రి పై విషయాన్ని పేర్కొన్నారు. ఈ ఉదంతానికి సంబంధించి వాట్సప్(WhatsApp)ను పూర్తి నివేదిక కోరామని, పౌరుల ప్రయివేటు డేటా సెక్యూరిటీ కోసం ప్రభుత్వం ఓ బిల్లును తీసుకురానుందని మంత్రి వెల్లడించారు.