India vs Pakistan: దిల్లీలో భారత్- పాకిస్థాన్ మ్యాచ్, బీజేపీ నేత కపిల్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు, అసెంబ్లీ ఎన్నికలతో హీటెక్కిస్తున్న హస్తిన రాజకీయం
ఈ నేపథ్యంలో దిల్లీ పీఠాన్ని ఎలాగైలా కైవసం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది....
New Delhi, January 23: దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలతో వాతావరణం రాజకీయంగా వేడెక్కింది. దిల్లీలోని మోడెల్ టౌన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా (Kapil Mishra) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచాయి. ఫిబ్రవరి 8న ధిల్లీ శాసన సభకు జరగనున్న ఎన్నికలను "ఇండియా- పాకిస్థాన్" మ్యాచ్‌గా ఆయన అభివర్ణించారు.
గతంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుడిగా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో ఉన్న కీలక నేతగా ఉన్న మిశ్రా, పార్టీలో తలెత్తిన అంతర్గత విబేధాలతో కేజ్రీవాల్ (Arvind Kejriwal) అవినీతిపై బహిరంగంగా ఆరోపణలు చేశారు. అనంతరం పార్టీని వీడి మరింత ఆప్ నేతలపై రెచ్చిపోయారు. 6 గంటల పాటు క్యూలైన్లో నిరీక్షించి నామినేషన్ వేసిన అర్వింద్ కేజ్రీవాల్
ఆప్ (AAP) ను వీడిన తర్వాత, మిశ్రా ఏ పార్టీలో చేరనప్పటికీ గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారాన్ని నిర్వహించారు. ఆ తర్వాత గత ఆగష్టులో అధికారికంగా బీజేపీలో చేరారు. వారం క్రితం దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం మోడెల్ టౌన్ నియోజకవర్గం నుంచి కపిల్ మిశ్రాను బరిలోకి దించుతున్నట్లు ప్రకటించింది.
ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన 'పౌరసత్వ సవరణ చట్టం' ను వ్యతిరేకిస్తున్న వారిలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రముఖంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ పీఠాన్ని ఎలాగైలా కైవసం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల కేంద్ర హోంశాఖ అమిత్ షా మాట్లాడుతూ సిఎఎ పై దుష్ప్రచారం చేస్తున్నారని, అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీలాంటి వారు పాకిస్థాన్ భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే కపిల్ మిశ్రా దిల్లీ ఎన్నికలను ఇండియా- పాకిస్థాన్ (India vs Pakistan) మ్యాచ్‌తో పోల్చారు. పార్టీలో ఉన్నప్పుడే పార్టీ ముఖ్యనేతపై దారుణమైన ఆరోపణలు చేస్తూ కేజ్రీవాల్ కు చుక్కలు చూపించిన మిశ్రా, ఇప్పుడు బీజేపీ అండతో తాను చేసే దాడిలో పదును మరింత పెరిగింది.
Here's the update:
ఫిబ్రవరి 8న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly Elections 2020) జరగనున్నాయి. 70 స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన పార్టీలుగా పోటీపడుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు దిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న కేజ్రీవాల్ ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడించబడతాయి.