Kawasi Lakhma: మా రోడ్లన్నీ హేమమాలిని చెంపల మాదిరిగా ఉంటాయి, చత్తీస్‌ఘడ్ మంత్రి కవాసీ లఖ్మా వివాదాస్పద వ్యాఖ్యలు, మండిపడుతున్న బీజేపీ నేతలు, గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి
మ్తారీ జిల్లాలోని కుర్ద్ డెవలప్ మెంట్ బ్లాక్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కవాసీ లక్మా తన నియోజకవర్గంలోని రోడ్లను హేమామాలినీ(actress Hema Malini) చంపలతో పోల్చారు.
Chhattisgarh, November 13: సీనియర్ కాంగ్రెస్ లీడర్, చత్తీస్‌గఢ్‌కు చెందిన ఎక్సైజ్ మంత్రి కవాసీ లఖ్మా (Chhattisgarh Minister Kawasi Lakhma) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మ్తారీ జిల్లాలోని కుర్ద్ డెవలప్ మెంట్ బ్లాక్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కవాసీ లక్మా తన నియోజకవర్గంలోని రోడ్లను హేమామాలినీ(actress Hema Malini) చంపలతో పోల్చారు.‘నేను నక్సల్స్ ప్రభావిత ప్రాంతం (Naxalite area) నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. కానీ ఆ ప్రాంతంలోని రోడ్లన్నీ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని చెంపల మాదిరిగా (Hema Malini's cheeks) నిర్మించానంటూ వ్యాఖ్యానించారు.
దీనిపై స్పందించిన బీజేపీ నేతలు మండిపడుతున్నారు. లఖ్మా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లఖ్మా వ్యాఖ్యలు కాంగ్రెస్ మైండ్ సెట్ ను తెలియజేస్తున్నట్లు దమ్తరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాము రొహ్రా (Dhamtari district BJP president Ramu Rohra)విమర్శించారు.
మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఓ మహిళా ఎంపీపై ఇలాంటి కామెంట్స్ తీవ్రంగా ఖండించదగినదని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని మథుర లోక్ సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ (BJP MP)గా హేమమాలినీ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
కాగా.. కవాసీ లఖ్మా వివాదాస్పద వ్యాఖ్యలు ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. సుక్మా జిల్లాలో జరిగిన ఓ సమావేశానికి మంత్రి కవాసీ లఖ్మా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. అయితే ఓ విద్యార్థి.. తనను ఈ విధంగా ప్రశ్నించారని మంత్రి చెప్పుకొచ్చారు.
గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు
మీరు గొప్ప నాయకుడిగా ఎదిగారు. ఇది మీకు ఎలా సాధ్యమైంది? నేను కూడా మీలా కావాలంటే ఏం చేయాలి? అని విద్యార్థి తనను ప్రశ్నించారని చెప్పారు. విద్యార్థి ప్రశ్నకు తాను ఈ విధంగా స్పందించాను.. మీరు కూడా కలెక్టర్, ఎస్పీ కాలర్ పట్టుకుని లాగితే గొప్ప నాయకులు(grab Collector and Superintendents of Police by their collars) అవుతారని విద్యార్థికి బదులిచ్చినట్లు మంత్రి తెలిపారు.