KTR Birthday Wishes to CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్ డే విషెస్.. విచారణకు వచ్చిన సిబ్బందికి చాయ్, ఉస్మానియా బిస్కెట్లు ఇస్తానని కామెంట్
ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Hyderabad, Nov 8: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (KTR Birthday Wishes to CM Revanth Reddy) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. అంతటితో ఆగకుండా తాను తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, మీ ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావచ్చంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. విచారణకు వచ్చిన సిబ్బందికి చాయ్, ఉస్మానియా బిస్కెట్లు ఇస్తానని తెలిపారు. వారు కోరితే మీ బర్త్ డే కేక్ కూడా కట్ చేయిస్తానని చెప్పారు.
ఎందుకు ఆ వ్యాఖ్యలు?
రేవంత్ కు శుభాకాంక్షలు చెప్తూనే కేటీఆర్ పై వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయంశం అవుతున్నది. ఫార్ములా-ఈ రేసుకు సంబంధించి అరెస్టు భయంతో కేటీఆర్ మలేషియా వెళ్తున్నారంటూ ఓ న్యూస్ పేపర్ రాసుకొచ్చిందని బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిషాంక్ చేసిన ట్వీట్ ను కేటీఆర్ ట్యాగ్ చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.
మేడపైన కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్.. వరంగల్ లో ఘటన (వీడియోతో)