Maharashtra CM Uddhav Thackeray: ఉద్దవ్ థాకరేకు పదవీ గండం, శాసన మండలి సభ్యునిగా నామినెట్ చేయాలని మంత్రివర్గం మరొకసారి అభ్యర్థన, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని మహారాష్ట్ర గవర్నర్
దేశంలో కెల్లా అత్యధికంగా అక్కడే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే (CM Uddhav Thackeray) కరోనా కట్టడి పనుల్లో చాలా బిజీ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయనకు పదవీ గండం వచ్చి పడింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు (Maharashtra Govt) మరొకసారి గవర్నర్ తలుపు తట్టారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను శాసన మండలి సభ్యునిగా నామినెట్ చేయాలంటూ గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారిని మంత్రివర్గం మరోసారి అభ్యర్థించింది.
Mumbai, April 28: కరోనావైరస్ మహారాష్ట్రను (coronavirus in Maharashtra) వణికిస్తోంది. దేశంలో కెల్లా అత్యధికంగా అక్కడే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే (CM Uddhav Thackeray) కరోనా కట్టడి పనుల్లో చాలా బిజీ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయనకు పదవీ గండం వచ్చి పడింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు (Maharashtra Govt) మరొకసారి గవర్నర్ తలుపు తట్టారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను శాసన మండలి సభ్యునిగా నామినెట్ చేయాలంటూ గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారిని మంత్రివర్గం మరోసారి అభ్యర్థించింది.
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (deputy chief minister Ajit Pawar) అధ్యక్షతన సోమవారం ఏర్పాటైన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. గడిచిన రెండు వారాల్లోనే రాష్ర్ట కేబినెట్ రెండు సార్లు ఈ ప్రతిపాదనను గవర్నర్ ముందుంచింది. అయితే కోష్యారి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నవంబర్ 28 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఠాక్రే ఇప్పటివరకు ఏ చట్టసభల్లోనూ సభ్యుడు కాలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల లోపు ఉభయ సభల్లో (అసెంబ్లీ, మండలి )ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంది. మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన ప్రభుత్వం
రానున్న మే 28 నాటికి ఠాక్రే సీఎంగా ఎన్నికై ఆరు నెలల పదవీకాలం ముగియనుంది. ఈ లోపు ఏదైనా సభకు ఎన్నిక కాకపోతే ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒక నెల సమయం మాత్రమే ఉంది. కరోనా సంక్షోభంలో ఇప్పుడు ఎన్నికలు జరిగే ప్రసక్తి లేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయంపైనే రాష్ర్ట రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయన్నది అక్కడ ఆసక్తికరంగా మారింది. లోక్‌సభలో మద్దతు, రాజ్యసభలో మద్దతు ఇవ్వం, పౌరసత్వ సవరణ బిల్లుపై స్వరం మార్చిన శివసేన, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తేనే బిల్లుకు మద్ధతు, వెల్లడించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే
2019 నవంబర్ 28న ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ పదవీకాలం మే 28లోగా ముగుస్తుంది. గవర్నర్ మంత్రి వర్గ తీర్మానాన్ని ఆమోదించకపోతే ఆయన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ లాక్‌డౌన్ ఎప్పడు ముగుస్తుందనేది ఇంకా తెలియలేదు. ఒకవేళ ముగిసినా మే 28లోపు మహారాష్ర్టలో ఎన్నికలు జరగడం అసాధ్యంలా కనిపిస్తోంది. ఎందుకంటే దేశంలోనే అత్యధిక కరోనా కేసులు అక్కడే నమోదయ్యాయి. రాష్ర్టంలో శివసేన , ఎన్సీపీ , కాంగ్రెస్ పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.