IPL Auction 2025 Live

Mulayam Health: విషమంగానే ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం.. సీసీయూలో చికిత్స.. కిడ్నీ ఇస్తానన్న సమాజ్‌వాదీ పార్టీ నేత

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)లో చికిత్స పొందుతున్న సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోసం అవసరమైతే కిడ్నీ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పార్టీ నేత అజయ్ యాదవ్ ప్రకటించారు.

Mulayam (Photo: Twitter)

NewDelhi, October 4: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ-CCU)లో చికిత్స (Treatment) పొందుతున్న సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు (SP President) ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) కోసం అవసరమైతే కిడ్నీ (Kidney) ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పార్టీ నేత అజయ్ యాదవ్ ప్రకటించారు. పార్టీ అధికార ప్రతినిధి మనోజ్ రాయ్ మాట్లాడుతూ.. ‘నేతాజీ’ ఆశీర్వాదం ప్రతి ఒక్కరికీ అవసరమని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వారణాసిలోని పలు ఆలయాల్లో పూజలు నిర్వహించినట్టు చెప్పారు.

పాటలు పాడుతూ గాయకుడు.. గర్భా నృత్యం చేస్తూ యువకుడి మృతి.. దసరా ఉత్సవాల వేళ.. ఒడిశా, మహారాష్ట్రలో విషాద ఘటనలు

కాగా, ములాయం చికిత్స పొందుతున్న గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి ఎవరూ రావొద్దని సమాజ్ వాదీ పార్టీ కోరింది. ములాయంకు ప్రస్తుతం క్రిటికల్ కేర్ యూనిట్‌లో చికిత్స  కొనసాగుతోందని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొంది. ఆసుపత్రికి వెళ్లినా ‘నేతాజీ’ని కలవడం సాధ్యం కాదని, కాబట్టి ఎవరూ ఆసుపత్రికి రావొద్దని విజ్ఞప్తి చేసింది. ములాయం ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని తెలిపింది. మరోవైపు, ములాయం తర్వగా కోలుకోవాలని కోరుతూ ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు.



సంబంధిత వార్తలు