Ajit Pawar: నాలుగో ఫ్లోర్ నుంచి కిందపడిన లిఫ్ట్.. త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నఎన్సీపీ నేత అజిత్ పవార్

ఎన్సీపీ నేత అజిత్ పవార్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరో ముగ్గురితో కలిసి అజిత్ పవార్ నాలుగో అంతస్తులో లిఫ్ట్ ఎక్కగా, అది ఒక్కసారిగా వేగంగా కిందికి జారి పడింది.. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Pune, Jan 16: ఎన్సీపీ (NCP) నేత అజిత్ పవార్ (Ajit Pawar) త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరో ముగ్గురితో కలిసి అజిత్ పవార్ నాలుగో అంతస్తులో లిఫ్ట్ (Lift) ఎక్కగా, అది ఒక్కసారిగా వేగంగా కిందికి జారి పడింది.. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పూణెలోని (Pune) హార్దికర్ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన.

పాకిస్థాన్‌ను అతలాకుతలం చేస్తున్న ఆహార సంక్షోభం.. గోధమపిండి ట్రక్‌ వెనక బైక్‌లతో పౌరుల ఛేజింగ్.. వైరల్ వీడియో

బారామతిలో తాను ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్టు అజిత్ పవార్ తెలిపారు. ప్రమాద సమయంలో తనతోపాటు 90 ఏళ్ల వైద్యుడు డాక్టర్ రెడీకర్, పోలీసులు కూడా లిఫ్ట్‌ లో ఉన్నట్టు చెప్పారు. తాము లిఫ్ట్‌ లోకి వెళ్లిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఆ వెంటనే లిఫ్ట్ నాలుగో అంతస్తు నుంచి వేగంగా కిందపడిందని వివరించారు. అంతా క్షణాల్లో జరిగిపోయిందన్నారు. ఆ తర్వాత లిఫ్ట్ డోర్‌ను బద్దలుగొట్టడంతో తామంతా సురక్షితంగా బయటపడినట్టు తెలిపారు.

నేపాల్‌లో కుప్పకూలిన విమానం, ప్రమాద సమయంలో విమానంలో 72 మంది, 5గురు భారతీయులు సహా మొత్తం 15 మంది విదేశీయులు 

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement