Eknath Shinde and Devendra Fadnavis Take Oath as CM and Deputy CM (Pic Credit-ANI-FILE)

Mumbai, Dec 1: మహారాష్ట్ర (Maharastra) శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి పదవుల పంపకం ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఎన్‌సీపీ చీఫ్‌ అజిత్‌ పవార్‌ (Ajith Pawar) వ్యాఖ్యల ప్రకారం బీజేపీకి ముఖ్యమంత్రి పదవి అని, ఎన్‌సీపీ, శివసేనలకు ఉప ముఖ్యమంత్రి పదవులు అని స్పష్టమవుతున్నది. అదే సమయంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైందని బీజేపీ ప్రకటించింది. మహాయుతి 2.0 ప్రభుత్వం గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తుందని మహారాష్ట్ర బీజేపీ శాఖ చీఫ్‌ చంద్రశేఖర్‌ శనివారం ఎక్స్‌ లో పోస్ట్‌ చేశారు. ముంబైలోని ఆజాద్ మైదాన్ లో ప్రధాని మోదీ సమక్షంలో సీఎం ప్రమాణం ఉండనున్నట్టు తెలుస్తోంది.

బిగ్‌ షాక్‌.. మరోసారి గ్యాస్‌ ధరల పెంపు, ఏఏ నగరాల్లో గ్యాస్ ధరలు ఎంత ఉన్నాయో తెలుసా?

సీఎం రేసులో ముందంజలో ఫడ్నవీస్‌

బీజేపీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో దేవేంద్ర ఫడ్నవీస్‌ ముందంజలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా, గత ఏక్‌ నాథ్‌ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇక, ఎన్‌సీపీ చీఫ్‌ అజిత్‌ పవార్‌ మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్‌ కు కొంత వరకు తెరదించారు. ఆయన శనివారం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పదవి బీజేపీకేనని స్పష్టం చేశారు. మహాయుతిలోని శివసేన, ఎన్‌సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు వస్తాయని చెప్పారు.

రోడ్డుపై పడ్డ ఆయిల్.. బైకులు స్కిడ్ అయి 60 మందికి గాయాలు..నాగారం రోడ్డుపై ఘటన, వీడియో ఇదిగో