PM's Open Challenge To Congress: దమ్ముంటే పాకిస్తానీలకు పౌరసత్వం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరిన ప్రధాని నరేంద్ర మోడీ, దేశ ప్రజలే మీకు సమాధానం చెబుతారు, కాంగ్రెస్ చేతుల్లో పావులుగా మారొద్దని విద్యార్థులకు హితవు

ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ (PM Narendra Modi) ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.

PM Modi Open Challenge To Congress And Allies Amid Row Over Citizenship Act (Photo-ANI)

New Delhi, December 17: కేంద్ర ప్రభుత్వం(Central GOVT) తీసుకువచ్చిన నూతన పౌరసత్వ చట్టంపై (Citizenship Act) దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ (PM Narendra Modi) ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. ఈ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్(Congress) సహా ఆ పార్టీ మిత్రపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ విమర్శలు గుప్పించారు.

ముస్లింలలో అనవసరంగా అభద్రతా భావాన్ని పెంచుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాకిస్తానీలందరికీ పౌరసత్వం ఇవ్వాలా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. దమ్ముంటే పాకిస్తానీలందరికీ పౌరసత్వం ఇస్తామని ప్రకటించండని కాంగ్రెస్‌కు సవాలు విసిరారు.

ANI Tweet

ఈ చట్టం ద్వారా ఈ దేశంలోని ఏ ఒక్క పౌరుడూ ఇబ్బంది పడకూడదనే అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం. ఈ విషయం చాలా సార్లు చెప్పాను, మరోసారి మళ్లీ చెబుతున్నాను. మేము చేసిన చట్టం పొరుగు దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మైనారిటీల కోసం మాత్రమే. నూతన పౌరసత్వ చట్టంపై కాంగ్రెస్, ఆ పార్టీ మిత్ర పక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి.

ముస్లింలలో అభద్రతా భావాన్ని కల్పించి రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నాయి. కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలకు నేను బహిరంగ సవాలు విసురుతున్నాను. వాళ్లకు పాకిస్తానీలందరికీ పౌరసత్వం ఇవ్వాలనుకుంటే బహిరంగంగా ప్రకటించండి. దేశ ప్రజలే వారికి సమాధానం చెప్తారు’’ అని మోడీ అన్నారు.

జార్ఖండ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ విద్యార్థులు తమకు, సంస్థలకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించాలని కోరారు. కాంగ్రెస్ చేతిలో పావులుగా మారొద్దని కోరారు. ప్రభుత్వ నిర్ణయాలపై చర్చించి, తమ గళాన్ని ప్రజాస్వామిక పద్ధతిలో వినిపించాలని తెలిపారు.

విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుందని, అయితే విద్యార్థుల భుజాలపై తుపాకులు పెట్టి కాల్చే అవకాశం అర్బన్ నక్సల్స్‌కు ఇవ్వవద్దని కోరారు. పౌరసత్వ సవరణ చట్టం మానవతావాద చట్టమని, ఈ చట్టం వల్ల ఏ మతస్థులకూ నష్టం జరగదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను గతంలోనూ చెప్పానని, మళ్ళీ చెప్తున్నానని, పౌరసత్వ సవరణ చట్టం ప్రభావం ఏ మతస్థుడి పౌరసత్వంపైనా ఉండదని చెప్పారు.