Rajinikanth VS CM K Palaniswami: రేపు సీఎం ఎవరైనా కావచ్చు, తమిళనాడు సీఎం ఎడపాటి వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన రజినీకాంత్, మరో శివాజీ గణేశన్‌లా తలైవార్ మిగిలిపోతారన్న తమిళనాడు సీఎం

రజనీకాంత్, కమల్‌ హాసన్‌ ఇద్దరూ రాష్ట్ర రాజకీయాల్లో మరో శివాజీగణేశన్‌లా మారిపోగలరని తమిళనాడు సీఎం ఎడపాడి (Tamil Nadu Chief Minister K Palaniswami) వ్యాఖ్యానించిన సంగతి విదితమే.

Tamilnadu politics Rajinikanth Attacks K Palaniswami With "Wonder And Marvel" Remark (Photo-IANS)

Chennai, November 19: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి కె పళనిస్వామి(Palaniswami) వ్యాఖ్యలకు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) కౌంటర్ వేశారు. రజనీకాంత్, కమల్‌ హాసన్‌ ఇద్దరూ రాష్ట్ర రాజకీయాల్లో మరో శివాజీగణేశన్‌లా మారిపోగలరని తమిళనాడు సీఎం ఎడపాడి (Tamil Nadu Chief Minister K Palaniswami) వ్యాఖ్యానించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా తమిళతెరపై ఎంజీ రామచంద్రన్‌ తరువాత నెంబరు టూలో ఉండిన శివాజీగణేశన్‌ పెట్టిన పార్టీ ఘోరపరాజయం పాలైన సంగతిని ఆయన గుర్తుచేశారు.

దీంతో పాటుగా ఆయననీ అనుకుంటున్నట్లుగా రాష్ట్రంలో రాజకీయ శూన్యత లేదని, అన్నాడీఎంకే ( AIADMK) రజినీ వ్యాఖ్యలను తిప్పికొట్టింది.వారిద్దరికీ రాజకీయాలు ఏమితెలుసని ఎద్దేవా చేసింది. ఈ విషయంపై రజినీకాంత్ స్పందించారు.

కొన్నిరోజులుగా మౌనం పాటించిన రజనీకాంత్‌ ఆదివారం రాత్రి చెన్నైలో జరిగిన కమల్‌ జన్మదినోత్సవ సంబరాల్లో నోరు విప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు (wonder and marvel) చోటుచేసుకుంటాయని అన్నారు. సీఎం అవ్వాలని రెండేళ్ల క్రితం ఎడపాడి కలలో కూడా ఊహించి ఉండరు. ఆయన సీఎం అయ్యాక ఈ ప్రభుత్వం ఎంతోకాలం నిలవదని 99 శాతం మంది ప్రజలు భావించారు. ఇలాంటి ఆశ్చర్యాలు రేపుకూడా జరగవచ్చని వ్యాఖ్యలతో రాజకీయ కలకలం రేపారు.

కాగా తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఏదో సంచలనానికి తెరలేపుతూనే ఉన్నాయి. జయలలిత హఠాన్మరణం వల్ల అన్నాడీఎంకేలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. జయలలిత హయాంలో చక్రం తిప్పిన శశికళ జైలు పాలయ్యారు. పెద్దగా గుర్తింపులేని ఎడపాడి పళనిస్వామి అకస్మాత్తుగా సీఎం అయ్యారు. ఎడపాడి ప్రభుత్వం రోజుల్లోనో నెలల్లోనో కూలిపోగలదని అందరూ ఆంచనావేయగా సుస్థిరమైన ప్రభుత్వంలో ఏళ్లతరబడి కొనసాగుతున్నారు.

అయితే జయలలిత, కరుణానిధి శకం ముగిసిన తరువాత కమల్‌హాసన్, రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం చేశారు. కమల్ హాసన్ మక్కల్‌ నీది మయ్యం పార్టీ (Makkal Needhi Maiam founder Kamal Haasan)ని స్థాపించి గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో గణనీయమైన ఓట్లను సాధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం నెలకొని ఉన్నా, ముఖ్యమంత్రి పీఠానికే గురిపెట్టి 2021లో రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కమల్‌ పనిచేస్తున్నారు.

2017 డిసెంబర్‌లో రాజకీయ అరంగేట్రం చేసినా పార్టీ స్థాపనపై రజనీకాంత్‌ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే అప్పుడప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయశూన్యతను తాను భర్తీ చేస్తానని రజనీకాంత్‌ ఇటీవల ఓ ప్రకటన చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలతో రజనీ, కమల్‌ ఇద్దరూ సీఎం కుర్చీపై కన్నేసి ఉన్నారని తెలుస్తోంది. కాగా తమిళనాడుకు 2021లో అసెంబ్లీ ఎన్నికలు (Tamil Nadu Assembly election in 2021) జరగనున్నాయి.