Lok Sabha Elections 2024: ఎవరీ కిశోరీలాల్ శర్మ..బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీని ఢీకొట్టగలడా, 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా అమేథీ నుంచి గాంధీయేతర వ్యక్తి పోటీ

అందరి ఊహలు పటాపంచల్‌ చేస్తూ లోక్‌సభ ఎన్నికలకు రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ బరిలోకి దిగుతున్నారు. ఇక హై ఓల్టేజ్‌ స్థానం అమేథీ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కిషోరీలాల్‌ శర్మ పోటీ చేస్తున్నారు.

Kishori Lal Sharma (Photo-ANI)

New Delhi, May 3: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలపై సస్పెన్స్‌కు కాంగ్రెస్‌ తెరదించింది. అందరి ఊహలు పటాపంచల్‌ చేస్తూ లోక్‌సభ ఎన్నికలకు రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ బరిలోకి దిగుతున్నారు. ఇక హై ఓల్టేజ్‌ స్థానం అమేథీ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కిషోరీలాల్‌ శర్మ పోటీ చేస్తున్నారు. ఐదో విడతల ఎన్నికల్లో భాగంగా అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిషోరీ లాల్ శర్మ నామినేషన్ వేశారు. శుక్రవారం అమేఠీ రిటర్నింగ్ అధికారికి ఆయన తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.

దశాబ్దాల తర్వాత తొలిసారి అమేథీ నుంచి గాంధీయేతర వ్యక్తి కిశోరీలాల్ శర్మఆ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు. అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీని ఆయన ఎదుర్కోబోతున్నారు. కిశోరీలాల్ శర్మ గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. నాలుగు దశాబ్దాలుగా గాంధీ కుటుంబంతోనే ఆయన ఉన్నారు. పంజాబ్‌లోని లుధియానాకు చెందిన శర్మ 1983లో రాజీవ్‌గాంధీతో కలిసి రాయ్‌బరేలీ, అమేథీలో అడుగుపెట్టారు.  కాంగ్రెస్ కంచుకోటలో తొలిసారిగా గాంధీయేతర వ్యక్తి పోటీ, అమేథీ నుంచి స్మృతి ఇరానీపై కిషోరీలాల్‌ శర్మ పోటీ, రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ బరిలోకి..

1991లో రాజీవ్‌గాంధీ మరణం తర్వాత గాంధీ కుటుంబానికి శర్మ మరింత సన్నిహితంగా మారారు. గాంధీల గైర్హాజరీలో ఆ రెండు నియోజకవర్గాలను పర్యవేక్షిస్తున్నది ఆయనే. ఈ నియోజకవర్గాలను తరచూ సందర్శిస్తూ ఉంటారు. సోనియాగాంధీ తొలిసారి రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత అమేథీ వెళ్లినప్పుడు ఆమె వెంట ఉన్నది ఆయనే. రాహుల్‌గాంధీ కోసం అమేథీ స్థానాన్ని సోనియా వదిలేసి రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసినప్పుడు రాహుల్ వెంట ఉన్నది కూడా ఆయనే.

రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ తాజా ప్రకటనతో ఆమె ప్రత్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నట్లే తెలుస్తోంది. ఇప్పటికే వయనాడ్‌ నుంచి మరోసారి నామినేషన్‌ దాఖలు చేసిన రాహుల్‌.. అమేథీలో పోటీకి ఆయన ముందు నుంచి నిరాసక్తి చూపుతూ వస్తున్నారు. కానీ రాహుల్‌ను రాయ్‌బరేలీలో రంగంలోకి దింపి కాంగ్రెస్‌ షాక్‌ ఇచ్చింది. అయితే అమేథీలో 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్‌ ఘోర ఓటమిని చవిచూశారు.

2004 నుంచి 2014 వరకు రాయ్‌బరేలీలో ఆయన తల్లి సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహించారు. కానీ ఈసారి ఆమె రాజ్యసభకు వెళ్లడంతో అక్కడ పోటీకి మరో వ్యక్తి అవసరం వచ్చింది. దీంతో ప్రతిష్టాత్మకమైన ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు రాహుల్ సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌తో పోటీ పడుతున్నారు.ఇక ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉండగా..కాంగ్రెస్‌ 17 చోట్ల పోటీ చేస్తోంది. మిగతా 63 స్థానాల్లో ఇండియా కూటమిలో మిత్రపక్షమైన సమాజ్‌వాదీపార్టీ, ఇతర ప్రాంతీయ పార్టీలో పోటీ చేస్తున్నాయి.

గత 25 ఏళ్లలో నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అమేథీ ఎన్నికల బరిలో కనిపించకపోవడం ఇదే తొలిసారి. చివరిసారి 1998లో గాంధీయేతర కుటుంబ సభ్యుడిని అమేథీ నుంచి పోటీకి దింపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెప్టెన్ సతీష్ శర్మను పోటీచేశారు. అయితేబీ జేపీ అభ్యర్థి సంజయ సిన్హ చేతిలో ఆయన ఓడిపోయారు. అంతకు ముందు 1996 ఎన్నికలలో శర్మ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజా మోహన్ సింగ్‌పై విజయం సాధించారు.

అయితే అమేధీ ఎంపీ అభ్యర్థిగా గాంధీ కుటుంబంలోని వ్యక్తిని కాకుండా బయట వ్యక్తిని బరిలో దింపడంతో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ అగ్రనేతలు వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. అమేధీ నుంచి బరిలో దిగితే ఓటమి తప్పదనే విషయం గాంధీ కుటుంబానికి అర్థమైందని అంటున్నారు. అందుకే వారు మరో స్థానాన్ని ఎంచుకున్నారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో గాంధీ కుటుంబంలోని వారిని కాకుండా బయట వ్యక్తిని బరిలో దింపడంతో.. ఎన్నికల ముందే ఓటమి తథ్యమని గాంధీ కుటుంబం అర్థమైందని బీజేపీ నేతలు ఆరోపణలు సంధిస్తున్నారు.

కిషోరీలాల్‌ శర్మ గురించి..

కిషోరీలాల్‌ శర్మ 1939 సెప్టెంబర్‌ 25న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 84 సంవత్సరాలు.

పంజాబ్‌లోని లుధియానాకు చెందిన ఆయనకు గత 40 ఏళ్లుగా కాంగ్రెస్‌తో అనుబంధం ఉంది.

1983లో తొలిసారి అమేథీకి వచ్చి అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ తరపున పనిచేస్తూ వస్తున్నారు.

కిషోరి లాల్ శర్మ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత గాంధీ కుటుంబంతో అతని బంధం మరింత బలపడింది.

సోనియా గాంధీ 1999లో అమేథీ నుంచి తొలిసారి గెలుపొందడంలో కేఎల్ శర్మ కీలక పాత్ర పోషించారు.

రాహుల్ కోసం సోనియా గాంధీ సీటు వదులుకున్న తర్వాత అమేథీ, రాయ్‌బరేలీలో శర్మ పార్టీ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు.

25 ఏళ్లలో తొలిసారి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif