Ayodhya Ram Mandir: 30 ఏళ్ల క్రితమే రామ్ మందిర్ డిజైన్, వీహెచ్‌పీ వినతి మేరకు ఆకృతి చూపిన చంద్రకాంత్ సోంపురా , నగర శైలిలో ఆలయం, ఆరున్నర ఎకరాల్లో రామ మందిర్, ఇదే డిజైన్‌తో ఆలయం రూపుదిద్దుకునే అవకాశాలు
గుజరాత్ వాసి చంద్రకాంత్ సోంపురా(Chandrakant Sompura) 1989లో నాటి విశ్వహిందూ పరిషత్ (Vishwa Hindu Parishad)చీఫ్ అశోక్ సింఘాల్ వినతి మేరకు రామాలయ నిర్మాణానికి డిజైన్ గీశారు.
New Delhi, November 12: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి(Ram temple construction) సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితమే డిజైన్(Sompura's design) రూపొందించారు. గుజరాత్ వాసి చంద్రకాంత్ సోంపురా(Chandrakant Sompura) 1989లో నాటి విశ్వహిందూ పరిషత్ (Vishwa Hindu Parishad)చీఫ్ అశోక్ సింఘాల్ వినతి మేరకు రామాలయ నిర్మాణానికి డిజైన్ గీశారు. 1990లో అలహాబాద్‌లో కుంభ మేళా సమయంలో సమావేశమైన సాధువులు ఈ ఆకృతికి అంగీకరించారు. కాగా ఈ డిజైన్‌లో పేర్కొన్న విధంగా శిల్పులు శిల్పాలు, స్తంభాల్లో 40 శాతం వరకు ఇప్పటికే చెక్కారు. నిర్మాణ పనులు పూర్తి చేయాలంటే కనీసం రెండున్నరేళ్లు పడుతుందని అంచనా.
సుప్రీంకోర్టు తీర్పు మేరకు ట్రస్ట్ ఏర్పాటు, వనరుల సమీకరణకే కనీసం 3 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు సుప్రీం కోర్టు నేపథ్యంలో ఇదే డిజైన్‌తో ఆలయం(Ram Janmabhoomi temple) రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. ఇప్పటికే వచ్చే శ్రీరామనవమి(Ram Navmi)కి ఆలయ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వీహెచ్‌పీ నేతలు క్లూ కూడా ఇచ్చారు.
దీనికి ప్రధాన కారణం కూడా లేకపోలేదు. ఇప్పుడు మరో నమూనా రూపొందించి, మళ్లీ దానికి తగిన రీతిలో రాయి సమకూర్చుకోవడం వంటి అంశాలు ఇమిడి ఉన్నందున ఆలయ నిర్మాణానికి తగు సమయం పట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే చంద్రకాంత్ సోంపురా కుటుంబం దేశ విదేశాల్లోని వందలాది ఆలయాలకు నమూనాలను అందించింది.
చంద్రకాంత్ సోంపురా తండ్రి ప్రభాకర్ సోంపురా గుజరాత్‌లోని సోమ్‌నాథ్ ఆలయానికి, మథురలోని శ్రీకృష్ణ ఆలయానికి డిజైన్ అందించారు. ఇక చంద్రకాంత్ సోంపురా స్వయంగా 100 ఆలయాలకు శిల్పిగా వ్యవహరించారు. ఇందులో గుజరాత్‌లోని స్వామి నారాయణ్ మందిర్ వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి.
సోంపురా రూపొందించిన నమూనా వివరాలు
ఆలయ నిర్మాణానికి సుమారుగా ఆరున్నర ఎకరాల స్థలం అవసరం ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన ‘నగర’ శైలిలో ఆలయం కొలువుతీరుతుంది. ఆలయం గర్భ గృహం, అంత్రల్, మహా మండపం, రంగ మండపం, ప్రవేశ మండపం..ఇలా ఐదు భాగాలుగా ఉంటుంది. ఈ భాగాల గుండానే సీతా సమేత శ్రీరాముని దర్శనం ఉంటుంది. అలాగే గర్భ గృహానికి ఒక ద్వారం, మహా మండపానికి 7 ద్వారాలు ఉంటాయి. ప్రధాన ఆలయం రెండంతస్తుల్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో బాల రాముడి విగ్రహం, మొదటి అంతస్తులో రామ దర్బారు ఉంటుంది. ఆ పైన ఆలయ శిఖరం ఉంటుంది. దీంతో పాటుగా ప్రధాన ఆలయానికి ఒకవైపు కథా కుంజ్ ఉంటుంది.
నమూనా ఆలయ వివరాలు
మొత్తం 212 స్థంభాలు
270 అడుగుల పొడవు
126 అడుగుల వెడల్పు
132 అడుగుల ఎత్తుతో ప్రధాన ఆలయ కట్టడం
81 అడుగుల మేర గోపుర శిఖరం