Uttar Pradesh Horror: ప్రముఖ డ్యాన్సర్‌పై 11 మంది గ్యాంగ్ రేప్, మత్తు మందు ఇచ్చి కోరిక తీర్చుకున్న కామాంధులు, యూపీలో దారుణ ఘటన
ఓ స్టార్ డ్యాన్సర్‌పై 11 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను ఎవరికైనా చెబితే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు గురి చేశారు. ఆమె ధైర్యం తెచ్చుకొని పోలీసులు ఫిర్యాాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Kanpur, March 1: యూపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ స్టార్ డ్యాన్సర్‌పై 11 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను ఎవరికైనా చెబితే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు గురి చేశారు. ఆమె ధైర్యం తెచ్చుకొని పోలీసులు ఫిర్యాాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
బాధిత యువతి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలో ఓ ప్రొఫెషనల్ డ్యాన్సర్ కు కాన్పూర్ జిల్లాలోని బితూర్ (Bithoor) ప్రాంతంలోని ఓ కాంట్రాక్టర్ నుంచి ఫిబ్రవరి 6వ తేదీన ఫోన్ కాల్ వచ్చింది. తమ ఫామ్ హౌస్ లో నిర్వహించే కార్యక్రమంలో డ్యాన్స్ చేయాలని అతను చెప్పాడు. దీనికి ఆమె అంగీకరించి అతడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళింది. అయితే అక్కడస్టేజీ కాని, ఇతర ఏర్పాట్లు గానీ కనిపించలేదు. దీంతో ఆమె ఇదేంటని ప్రశ్నించింది.
ఫాం హౌస్ లోని ఓ గదిలోనే డ్యాన్స్ చేయాలని, డబ్బులు ఎంతైనా ఇస్తామని ఆమెను ప్రలోభపెట్టారు. దీనికి ఆమె అంగీకరించింది. ఆమె డ్యాన్స్ చేస్తున్న సమయంలో మత్తుమందులు కలిపిన కూల్ డ్రింక్స్ ను అందించారు. వాటిని తాగిన వెంటనే ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది.
యూపీలో దారుణం, మొబైల్ ఛాటింగ్ చేస్తుందని భార్యకు ఉరివేసి చంపేసాడు, ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు
అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెపై కాంట్రాక్టర్ , అతడితో పాటు ఉన్న 10 మంది ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను వీడియో కూడా తీశారు. దీనిని ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని, తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు బెదిరించారు. దీంతో ఆమె భయపడింది. అయితే సోమవారం ఆమె ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బర్రా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి (Barra police station incharge) దీనానాథ్ మిశ్రా ( Dinanath Mishra) తెలిపారు. ఈ విషయంలో విచారణ కొనసాగుతోందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన చెప్పారు. నిందితులు దేవా సర్దార్, మోహిత్, శోభిత్, 7-8 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్లు 328, 376, ఐటీ చట్టంలోని సెక్షన్ 66 డి కింద కేసు నమోదు చేసినట్లు మిశ్రా తెలిపారు.